ఇక వాట్సాప్ లోనే మెట్రో టికెట్స్

ఇక వాట్సాప్ లోనే మెట్రో టికెట్స్

కాలానుగుణంగా వెలువడుతున్న కొత్త సాంకేతికతలతో అనేక పనులు సులువుగా మారుతున్నాయి. ఇప్పుడు... వాట్సాప్‌లోనే (Whatsapp) మెట్రో టిక్కెట్లను (Metro Tickets) కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది. వాట్సాప్ ఆధారిత క్యూఆర్ కోడ్ టికెటింగ్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో మెట్రో స్టేషన్లలో టోకెన్లను తీసుకెళ్లే పని లేకుండా పోతుంది. అయితే... ఈ సేవలు ప్రస్తుతం చెన్నై మెట్రోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని మొదట కోయంబేడు ,ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్లలో ప్రవేశపెట్టారు. తర్వాత... చెన్నైలోని 41 మెట్రో స్టేషన్లలో వాట్సాప్ ఆధారిత క్యూఆర్ కోడ్ టికెటింగ్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది.

వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ కొనాలంటే... ముందుగా కౌంటర్ కు వెళ్లాలి. మీ ఫోన్ నంబర్ ఇవ్వాలి. మీ గమ్యాన్ని సూచించండి. మీకు ఎన్ని టిక్కెట్లు కావాలో చెప్పండి. కంప్యూటర్‌కు కనెక్ట్ చేయబడిన కీబోర్డ్‌లో ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా టైప్ చేయాలి. మీ WhatsApp నంబర్‌కు QR కోడ్ వస్తుంది. చెల్లింపు ఆప్షన్స్ చూపిస్తుంది. . నగదు, కార్డు, UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఇది కూడా పూర్తిగా సురక్షితం తా ఉంటుంది.

వాట్సాప్‌లో మెట్రో టికెట్ సేవలు తరచుగా కాకుండా అప్పుడప్పుడు మెట్రోలో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటాయి” అని సీఎంఆర్‌ఎల్ ఎండీ ఎంఏ సిద్ధిఖీ అన్నారు.

పేపర్ వినియోగాన్ని తగ్గించి మెట్రోను పర్యావరణ హితంగా మార్చేందుకు చెన్నై మెట్రో చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్ టికెటింగ్ సర్వీస్‌తో మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్ ద్వారా సబ్ వే టికెట్ సర్వీస్ తో... ప్రతి నెలా 4 టన్నుల పేపర్ వినియోగం తగ్గుతుందని చెప్పారు. ఖర్చులు కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.

నిజానికి... చెన్నై మెట్రో దాదాపు పేపర్ క్యూఆర్ టిక్కెట్లను రద్దు చేసింది. అత్యవసరమైతే తప్ప టోకెన్లు కూడా ఇవ్వడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story