Omicron India: భారత్‌లోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఎంతంటే..

Omicron India: భారత్‌లోని 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఎంతంటే..
Omicron India: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

Omicron India: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది అనుకుంటే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాను పాకిన ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22, రాజస్తాన్‌లో 17, తెలంగాణలో 8, కర్నాటకలో 7, కేరళలో 5, గుజరాత్‌లో 5, ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

కొత్తగా హైదారాబాద్‌ మీర్‌చౌక్‌లో 5 రోజుల క్రితం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన 35 ఏళ్లు యువకుడికి ఒమిక్రాన్ సోకింది. అలాగే హన్మకొండలో ఈనెల 3న యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు మీర్‌చౌక్ ప్రాంతంలో RT-PCR టెస్టులు ముమ్మరం చేసిన వైద్య అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కాలనీల్లో పూర్తిగా శానిటైజేషన్ చేశారు.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 8కి చేరిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మూడు, గురువారం మరో నాలుగు కొత్త వేరియంట్ కేసులు నమోదయిందని తెలిపారు. కొత్త వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకున్నపటికీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డీహెచ్ సూచించారు.దేశంలో వ్యాక్సినేషన్ నిర్విరామంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. అయితే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. అత్యవసర అయితే తప్పా, ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story