భారత్‌ను రెచ్చగొట్టి మరీ చావుదెబ్బ తిన్న పాకిస్థాన్

భారత్‌ను రెచ్చగొట్టి మరీ చావుదెబ్బ తిన్న పాకిస్థాన్
పాకిస్థాన్ బుద్ధి మారలేదు. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టి, చావుదెబ్బ తింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన పాక్‌ మూకలపై మనసైన్యం సింహంలా గర్జించింది..

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టి, చావుదెబ్బ తింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన పాక్‌ మూకలపై మనసైన్యం సింహంలా గర్జించింది.. పాక్‌ సైనిక, ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా నిప్పులవాన కురిపించింది. శతఘ్నులు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో శత్రు స్థావరాలు పేకమేడల్లా నేలకూలాయి. 8 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. కొందరు పాక్ సైనికులుతోకముడిచి పరుగులు తీయడం వీడియోల్లో కనిపించింది.

భారత్‌లోకి చొరబాట్లకు తోడ్పడేందుకు నియంత్రణరేఖ వెంబడి నిన్న గుళ్లవర్షం కురిపించింది పాకిస్థాన్. ఈ దాడిలో ఐదుగురు భారత సైనికులతోపాటు 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు జవాన్లతోపాటు పదిమంది గాయపడ్డారు. దీంతో పాక్ కుతంత్రాన్ని మన సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్ మిస్సైళ్లు, రాకెట్లతో దాడులు చేసి పాక్ బంకర్లను ధ్వంసం చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం సమయంలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. సైనిక బంకర్లతోపాటు గ్రామాల్లోని నివాస ప్రాంతాలపై కాల్పులు జరిపింది. గురేజ్‌ సెక్టర్ నుంచి యూరి సెక్టార్ దాకా పలు సెక్టార్లలో మోర్టార్లతో గుళ్లవర్షం కురిపించింది. పాక్ కుత్రంత్రాన్ని పసిగట్టిన భారత జవాన్లు భారీ స్థాయిలో పాక్ బంకర్లపై ఎదురుదాడికి దిగింది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లు, రాకెట్లతో విరుచుకుపడింది. పాక్‌కు చెందిన పలు పంకర్లను నేలమట్టంచేసింది. ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసింది. భారత్‌లోకిచొరబడే ఉగ్రవాదులకు చెందిన భవనాలను, చమురు నిల్వలను నేలమట్టం చేశారు. పాక్ సైన్యం ఊపిరి పీల్చుకోకుండా చేశారు. దీంతో పలు చోట్ల పాక్ సైనికులు బంకర్లనుంచి పరుగులు తీసిన దృశ్యాలుకూడా కనిపించాయి..

మన సైనికుల ఎదురుదాడిలో 11 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు తెలిసింది. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన పాక్‌ జవాన్లలో దాదాపు ముగ్గురు ఆ దేశ 'స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌నకు చెందినవారుగా గుర్తించారు. పాకిస్థాన్‌ బంకర్లు, లాంచ్‌పాడ్‌లను ధ్వంసంమైన వీడియోలను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి. ఆ వీడియోల్లో భారత బలగాలు పాక్‌ స్థావరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలున్నాయి. ఒక బంకర్‌పైకి భారత సైనికులు ప్రయోగించిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ వీడియోలో ఉంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అదే బంకర్‌ పైకి మరో రెండు మిస్పైళ్లను మన సైనికులు ప్రయోగించారు. దాదాపు నిన్న రోజంతా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

వారం రోజుల వ్యవధిలో పాక్ నుంచి చొరబాట్లకు ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడటం ఇది రెండవ సారి. దావర్, కేరన్, యూరీ, నౌగామ్‌ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. నవంబర్ 7-8 తేదీలలో మాచిల్ సెక్టార్‌లో చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదులను మనబలగాలు మట్టుపెట్టినవిషయం తెలిసిందే. భారత జవాన్ల త్యాగాన్ని పండుగవేళ దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది.

మరోవైపు ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా సైనికులతో దీపావళి సెలబ్రేట్‌ చేసుకోనున్నారు ప్రధాని మోదీ. కాసేపట్లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లనున్న ప్రధాని.. సరిహద్దులో జవాన్లతో కలిసి ఉత్సవాలు జరుపుకోనున్నారు. వారికి మిఠాయిలు పంచనున్నారు. సరిహద్దులో ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లకు ఆత్మస్థైర్యం కల్పించనున్నారు ప్రధాని.

Tags

Read MoreRead Less
Next Story