Modi: సనాతన ధర్మం, భారత్‌ అంశాలపై స్పందించిన ప్రధాని

Modi: సనాతన ధర్మం, భారత్‌   అంశాలపై  స్పందించిన ప్రధాని
వాస్తవాలకు కట్టుబడి ఉండాలని సూచన

ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై అతిగా స్పందించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలకు దీటుగా సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ఆదేశించారు. అలా అని చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు. సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై స్పందిస్తారని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఒకవైపు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై రాజకీయ దుమారం చెలరేగుతుండగా మరోవైపు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపైనా వివాదం చెలరేగుతోంది. ఈ రెండు అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై ఆచితూచి మాట్లాడాలని ప్రధాని కేంద్ర మంత్రులకు సూచించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలు భారత్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భారత్‌ అంశంపై అతిగా స్పందించొద్దని కేంద్ర మంత్రులకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే దీనిపై మాట్లాడాలని ప్రధాని స్పష్టం చేసినట్లు సమాచారం.


తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు మోదీ సూచించినట్లు సమాచారం. చరిత్రలోతుల్లోకి తొంగిచూడొద్దని కానీ రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండాలని కేబినేట్‌ సహచరులకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడాలని కేంద్రమంత్రులకు సూచించిన ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరమని అన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి 3 వేల 760 కోట్ల కేటాయింపులకు కేంద్ర కేబినేట్‌ ఆమోదముద్ర వేసింది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద కేంద్రం నిధులు కేటాయించామని మొత్తం ఖర్చు తామే భరిస్తామని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామని వివరించారు. దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ విధానం ఉపకరిస్తుందని కేంద్రం తెలిపింది. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో పరిశ్రమల అభివృద్ధికి 11 వందల 64 కోట్ల కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story