రాయబారం నడిపినా రాజకీయాల్లోకి రానంటున్న రాజ్ కుమార్..

రాయబారం నడిపినా రాజకీయాల్లోకి రానంటున్న రాజ్ కుమార్..
కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ లోక్‌సభ ఎన్నికల ప్రతిపాదనను నటుడు శివ రాజ్‌కుమార్ తిరస్కరించారు.

కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ లోక్‌సభ ఎన్నికల ప్రతిపాదనను నటుడు శివ రాజ్‌కుమార్ తిరస్కరించారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం అందరికీ రాదని, వచ్చిన అవకాశం వదులుకోవద్దని నటుడు శివ రాజ్‌కుమార్‌కు నచ్చజెప్పారు. అయినా ససేమిరా అన్నారు హీరో. పార్టీ నుంచి లోక్‌సభ టిక్కెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ అధిష్టానం తరపున రాయబారం నడిపినా శివ రాజ్ కుమార్ మరో ఆలోచన లేకుండా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదనను కన్నడ సినీ నటుడు శివ రాజ్‌కుమార్ తిరస్కరించారు. బెంగళూరులో జరిగిన ఈడిగ సంఘం సదస్సులో, కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్, హీరో శివ రాజ్‌కుమార్‌ను కలిసి పలు అంశాల గురించి చర్చించారు.అందులో భాగంగానే టికెట్ ఆఫర్ చేశారు.

" తలుపు తట్టి వచ్చిన ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని" అతను నటుడిని కోరారు. ‘‘పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని శివ రాజ్‌కుమార్‌కు చెప్పాను.. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాల్లో నటించవచ్చు.. కానీ పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఘనత అందరికీ రాదు.. మీకు వచ్చిన అలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు " అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి మరియు లెజెండరీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు శివ రాజ్‌కుమార్ ఈ ఆఫర్‌పై వినయంతో స్పందించారు. ముఖానికి మేకప్ వేసుకుని నటించి మీ అందరినీ మెప్పించడం మా నాన్నగారు ఇచ్చిన గిఫ్ట్.. అక్కడే నా జీవితం ముగుస్తుంది.. నా ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటాను. నటుడిగానే ఉంటాను. రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ప్రత్యేకంగా మంచి పని చేసేవాళ్లు కూడా ఉన్నారు’’ అలాంటి వారికి అవకాశం ఇవ్వండి. కానీ నాకు మాత్రం వద్దు అని ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు శివ రాజ్ కుమార్.

తన భార్య, మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్‌కుమార్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉండడంతో ఈ ఏడాది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరరానే విషయాన్ని తెలియజేశారు. తనను రాజకీయ రంగంలోకి దిగమని తన భార్య కానీ, తన బావమరిది విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పగానీ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని శివ రాజ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story