హిందీ రాకపోవడంతో తమిళ మహిళకు అవమానం.. సీఎం స్టాలిన్ జోక్యం

హిందీ రాకపోవడంతో తమిళ మహిళకు అవమానం.. సీఎం స్టాలిన్ జోక్యం
హిందీ భాష తెలియక తమిళ మహిళ అవమానానికి గురైందంటూ వచ్చిన నివేదిక నేపథ్యంలో భాషా వైవిధ్యంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని కోరారు.

హిందీ భాష తెలియక తమిళ మహిళ అవమానానికి గురైందంటూ వచ్చిన నివేదిక నేపథ్యంలో భాషా వైవిధ్యంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని కోరారు.

"హిందీయేతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు హిందీ తెలియనందుకు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది వేధింపులకు గురవుతున్న సంఘటనలు పునరావృతమవుతున్నాయి. హిందీ జాతీయ భాష దానినే మాట్లాడలని అనడం తప్పుదోవ పట్టించేదిగా ఉంది.. ఇలా బలవంతం చేయబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది" అని తమిళనాడు సిఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

దక్షిణ భారతీయులపై హిందీని రుద్దడంతో కేంద్రంపై విమర్శలు చేసిన స్టాలిన్, మహిళ ఎత్తి చూపిన సమస్య , ఇది వ్యక్తులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, వ్యవస్థాగతమైన సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రయాణీకులతో ఎలా ప్రవర్తించాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్నారు. మన భారతదేశంలో వివక్షకు స్థానం లేదు; అన్ని భాషలకు సమాన గౌరవాన్ని అందిద్దాం." అని పేర్కొన్నారు.

గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్-ఇన్‌లో షర్మిలా రాజశేఖర్ అనే తమిళ మహిళను CISF సిబ్బంది అవమానించారు. ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, చెన్నైకి చెందిన 34 ఏళ్ల టెకీ మాట్లాడుతూ, చెన్నైకి రాత్రి 8:30 గంటల విమానంలో సెక్యూరిటీ చెక్-ఇన్ కోసం తన బ్యాగ్‌లను ఉంచే ప్రక్రియలో ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో, మహిళల క్యూలో ఉన్న ఒక CISF అధికారి, ప్రయాణికుడికి అర్థం కాని భాషలో హిందీలో మరొక ట్రేని ఉపయోగించమని ఆమెకు సూచించాడు.

"నాకు హిందీ రాదని నేను వారితో చెప్పాను, దాని కోసం భద్రతా బృందం నన్ను ఎగతాళి చేసి ఎక్కడ నుండి వచ్చావని అడిగారు. నేను తమిళనాడు నుండి వచ్చాను అని చెప్పాను. దాంతో అతడు తమిళనాడు భారతదేశంలో ఉందా అని అడిగాడు. హిందీ జాతీయ భాష తప్పక నేర్చుకోవాలి’’ అని అతడు షర్మిలతో చెప్పారు.

అయితే హిందీ జాతీయ భాష కాదని తమిళ మహిళ ఎత్తి చూపింది. నేను నా ఫోన్ తీసుకొని, గూగుల్ లో సెర్చ్ చేసి, హిందీ మాత్రమే అధికార భాష అని మహిళా అధికారికి చూపించాను," అని షర్మిలా అన్నారు. CISF సిబ్బంది నాతో మాట్లాడిన విధానం సరిగా లేదు.

ఆమె CISF సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో అధికారి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు గ్రీవెన్స్ అధికారికి షర్మిల ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story