ఆస్పత్రికి వద్దన్న భర్త.. ఇంట్లోనే ప్రసవించిన భార్య.. కానీ

ఆస్పత్రికి వద్దన్న భర్త.. ఇంట్లోనే ప్రసవించిన భార్య.. కానీ
అన్నిటికీ పెరటి వైద్యం పనికి రాదు.. ఆ విషయం తెలిసినా అమాయకత్వమో, మరొకటో అర్థం కాదు.

అన్నిటికీ పెరటి వైద్యం పనికి రాదు.. ఆ విషయం తెలిసినా అమాయకత్వమో, మరొకటో అర్థం కాదు. ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటారు కొందరు.. అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నా మూర్ఖత్వంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని కనులైనా తెరవని ఆ పసిగుడ్డుని కడుపులోనే చంపేశాడు.. ఈ క్రమంలో నవమాసాలు మోసి పండండి బిడ్డ జన్మనివ్వాల్సిన ఆమె ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి.

భర్త ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరాకరించడంతో కేరళ మహిళ ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు కోల్పోయింది. ప్రసవ ప్రయత్నంలో భార్య చనిపోవడంతో కేరళలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో వైద్య సహాయం పొందడం కంటే ఇంట్లోనే తన భార్యకు ప్రసవించాలని అతను పట్టుబట్టాడని పోలీసులు తెలిపారు.

ఆక్యుపంక్చర్‌తో ప్రసవ వేదన పడుతున్న భార్యకి వైద్యం చేసి తన ప్రతిభను చాటుకోవాలనుకున్నాడు.. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది.

భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 304 కింద ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇది హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్యకు సంబంధించినది. IPC యొక్క సెక్షన్ 313, స్త్రీ అనుమతి లేకుండా గర్భస్రావానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

మహిళ అతని రెండవ భార్య. ప్రసవ సమయంలో అతని మొదటి భార్య, ఆమె కుమార్తెతో కలిసి ఉంది. ఆ మహిళకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా మరోబిడ్డను కనడానికి ప్రయత్నించింది, ప్రాణాలు పోగొట్టుకుంది అని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story