Maharashtra: టీచర్లకు డ్రెస్‌కోడ్‌, జీన్స్‌, టీషర్ట్స్‌పై నిషేధం

Maharashtra: టీచర్లకు డ్రెస్‌కోడ్‌, జీన్స్‌, టీషర్ట్స్‌పై నిషేధం
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను

ఉపాధ్యాయులకు డ్రెస్‌కోడ్‌ను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు జీన్స్‌, టీ షర్టు, డిజైనర్‌, ప్రింటెడ్‌ దుస్తులు ధరించిస్కూల్కు రాకూడదని షరతులు విధించింది. మహిళా ఉపాధ్యాయులు జీన్స్‌, టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్‌, చుడీదార్‌, లేదా చీర ధరించాలని మహా సర్కా ర్‌ తెలిపింది. ఈ నిబంధనలు ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయి.

సుమారు 6 నెలల ముందు బీహార్‌లో పాఠశాల ఉపాధ్యాయులకు అక్కడి ప్రభుత్వం డ్రెస్‌కోడ్‌ ప్రవేశపెట్టింది. జీన్స్‌, టీషర్ట్స్‌ ధరించడంపై నిషేధం విధించింది. మహిళా టీచర్లు భారతీయ వస్త్రధారణలో పాఠశాలకు రావాలని సూచించింది. పురుష ఉపాధ్యాయులు గడ్డం పెంచకూడదని, క్లీన్‌ సేవ్‌ చేసుకుని రావాలని స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయులు తప్పకుండా ఫార్మల్‌ డ్రెస్‌ ధరించి రావాలని అందులో స్పష్టంచేశారు. జీన్స్‌, టీషర్టులు ధరించడం అఫిషియల్‌ కల్చర్‌ కాదని, అవి హుందాగా ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయానికి బడికి రావాలని, బడివేళలు ముగిసేదాకా ఉండాలని సూచించారు. తరగతి గదుల్లో కుర్చీలు వాడొద్దని స్పష్టంచేశారు. అస్సాం ప్రభుత్వం కూడా ఈ నిబంధనను ఇప్పటకే అమలు చేస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story