దొంగలు పడ్డారు.. టమాటాలు దోచుకెళ్లారు..

దొంగలు పడ్డారు.. టమాటాలు దోచుకెళ్లారు..
ఆ దొంగలు బంగారం, వెండి కోసం రాలేదు.. టమాటాలు దోచుకెళ్లడానికి వచ్చారు. ప్రస్తుతం అవే అత్యంత ఖరీదైనవి.

ఆ దొంగలు బంగారం, వెండి కోసం రాలేదు.. టమాటాలు దోచుకెళ్లడానికి వచ్చారు. ప్రస్తుతం అవే అత్యంత ఖరీదైనవి. అందరికీ కావలసినవి. టమాటా లేకుండా ఏ కూర వండాలన్నా మనసొప్పదాయే.. కొందామంటే రేటు ఆకాశంలో ఉంది. పాపం ఆ దొంగలు టమాట వేసిన కూర తిని ఎన్ని రోజులైందో.. ఏమైనా కానీ టమాట దోచుకెళ్లి కూర వండుకుని తినాలనుకున్నారు.. టమాటాలు అమ్మే దుకాణంలోకి చొరబడి కావలసినన్ని టమోటాలు దోచుకెళ్లారు.

యూపీ జిల్లాలో దుకాణాల్లో టమాటా దోచుకెళ్లారని కేసు నమోదైంది. ఇద్దరు షాపు యజమానులు రామ్‌జీ, నయీమ్‌ఖాన్‌లు దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం దుకాణాలు తెరిచి చూడగా పెద్ద మొత్తంలో టమోటాలు, అల్లం, మిరపకాయలు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో మొత్తం 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ మేరకు పోలీసులు సమాచారం అందగా ఇద్దరిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన జూలై 10, సోమవారం జరిగింది. ఇద్దరు షాపు యజమానులు రామ్‌జీ, నయీమ్‌ఖాన్‌లు దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి చూడగా పెద్ద మొత్తంలో టమోటాలు, అల్లం, మిరపకాయలు కనిపించకుండా పోయాయి. వీరిద్దరూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 379 కింద కమత ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఒక ట్విట్టర్ పోస్ట్‌లో, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పేరును "స్పెషల్ టొమాటో ఫోర్స్"గా మార్చాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story