భారత్ లో 'టిక్ టాక్' రీఎంట్రీ?

భారత్‌లో నిషేధానికి గురైన పబ్‌జీ మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు టిక్ టాక్ సైతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది టిక్‌టాక్ కంపెనీ. ఆ సంస్థ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఉద్యోగులకు రాసిన లేఖతో ఈ విషయం తేటతెల్లమైంది. గోప్యత, భద్రత పరమైన చర్యలు చేపట్టామని, ఇక దేశంలో తిరిగి ప్రవేశానికి ఇది సానుకూల అంశమంటూ లేఖలో పేర్కొన్నారు నిఖిల్ గాంధీ. భారత్‌లో రీఎంట్రీ ఇస్తున్నట్లు పబ్‌జీ మొబైల్ రెండ్రోజుల క్రితమే ప్రకటించింది. 24 గంటలు కూడా గడవకముందే ఇప్పుడు టిక్‌టాక్ సైతం ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించింది.
చైనా బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్.. డేటా గోప్యత, భద్రత వంటి వాటి విషయంలో స్థానిక చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. భారత్‌లో టిక్‌టాక్ అభివృద్ధికి ఇదో గొప్ప అవకాశమని, పూర్తి స్పష్టతతో కూడిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు లేఖలో తెలిపారునిఖిల్ గాంధీ. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామన్నారాయన. ఉద్యోగులతో కలిసి తిరిగి వినియోగదారులు, క్రియేటర్లకు అంకితమవుతామని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com