Maharashtra: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Maharashtra: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఎదురెదురుగా వస్తున్న లగ్జరీ బస్సులు ఢీకొట్టడంతో ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డాణాలో రెండు ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీ కొన్న ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి-నాగ్​పుర్ హైవేపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు తక్షణం సహాయక చర్యలు అందించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అమరనాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోలి వెళుతున్న బస్సు, నాసిక్ వెళుతున్న బస్సు ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటం వలనో లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే తరువాత అందిన సమాచారంతో నాసిక్ వెళుతున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్ టాక్ చేసేందుకు ప్రయత్నించగా, ఎదురుగా హింగోలి వైపు వెళుతున్న బస్సు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.


ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడే రాకపోకలకు అంతరాయం కలిగింది. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్వల్ప గాయాలతో 32 మంది ప్రయాణికులకు సమీపంలోని గురుద్వారాలో ప్రథమ చికిత్స అందించారు. అమ‌ర్‌నాథ్ నుంచి తిరిగి వ‌స్తున్న బ‌స్సుకు చెందిన డ్రైవ‌ర్ ఈ ప్ర‌మాదంలో మరణించాడు . రోడ్డు మీద నుంచి బ‌స్సుల్ని తొల‌గించిన త‌ర్వాత మ‌ళ్లీ ట్రాఫిక్‌ను పున‌రుద్ద‌రించిన‌ట్లు హైవే పోలీసులు వెల్ల‌డించారు.

బుల్దానా జిల్లాలో ఇటీవల జరిగిన రెండో అతిపెద్ద బస్సు ప్రమాదం ఇది. ఈనెల ప్రారంభంలోని మహారాష్ట్రలో ఓ బస్సు అగ్నికి ఆహుతి అయింది. సమృద్ధి మహా మార్గ్ ఎక్స్ప్రెస్ వైఫై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 26 మంది చనిపోగా చాలామంది గాయాలు పాలు అయ్యారు. బుల్దన జిల్లాలో జరిగిన ఆ సంఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story