UN : దేశం పేరు మార్పుపై ఐక్యరాజ్యసమితి ఏమన్నాదంటే..

UN : దేశం పేరు మార్పుపై ఐక్యరాజ్యసమితి ఏమన్నాదంటే..
ఒకవేళ అలాంటి విజ్ఞప్తి వస్తే...

దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస స్పందించింది. దేశాల పేరు మార్పు విషయమై ఆయా ప్రభుత్వాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడి ప్రతినిధి ఫర్హాన్ హక్ బుధవారం పేర్కొన్నారు.

తాజాగా జీ20 సదస్సు విందు కోసం అతిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొనడం, అంతకుముందు బ్రిక్స్ సమావేశం, తాజాగా ఆసియాన్ సదస్సులో అతిధులకు సైతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపడంతో ఈ వాదన నిజమేనన్న చర్చ సాగుతోంది. అయితే కేంద్రం మాత్రం ఇవి వదంతులే అని చెప్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. త్వరలో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కూడా ఈ వార్తలపై స్పందించింది. భారత్ పేరు మార్పు జరిగితే ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని దేశాలకూ ఈ సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని అధికారిక పత్రాల్లోనూ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల సంగతి ఎలా ఉన్నా ఐరాస మాత్రం తన అభిప్రాయం చెప్పింది.


జీ20 సమావేశాల్లో విందుకు ఆహ్వానపత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న నేపథ్యంలో మీడియా ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. గతేడాది టర్కీ దేశం పేరు మార్పు విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పేరు మారుస్తున్నట్టు అధికారికంగా ఐక్యరాజ్య సమితికి తెలిపింది. కాబట్టి.. ఇటువంటి అధికారిక వినతులను పరిణనలోకి తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు.

జీ20 సదస్సులో పాల్గొనబోయే అతిథులకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము డిన్నర్ ఆహ్వానాన్ని పంపారు. ఇందులో ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌కు మార్చబోతున్నారని, ఇప్పుడంతా అవసరం ఏముందని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలావుండగా ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పందించారు. భారత్ పేరు మార్పు వివాదంలో విషయంలో రాజకీయాలకు తావివ్వొద్దని, జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. భారత్ అనేది దేశానికి పూర్వం ఉన్న పేరేనని, కాబట్టి జాగ్రత్తగా వివాదాలకు పోకుండా మాట్లాలని సూచనలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story