Muharram 2023:ముస్లింలకు అషురా ఎందుకంత పవిత్రం

Muharram 2023:ముస్లింలకు అషురా ఎందుకంత పవిత్రం
అషురా రోజున ముస్లింలు ఎందుకు ఉపవాసం ఉంటారు...

మొహర్రం ( Muharram) ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి పండుగ. అదీకాక ఇస్లామిక్ క్యాలెండర్‌(Islamic calendar)లోని మొదటి నెల మొహర్రం. దీనిని ముస్లింలు చాలా పవిత్రమైన నెలగా భావిస్తారు. దీనిని సంతాప మాసంగా కూడా భావిస్తారు. మొహర్రం నెలలో మొదటి రోజును ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా అరబిక్ న్యూ ఇయర్( Arabic New Year ) అని అంటారు. ప్రతి ఏడాది మొహర్రం నెల పదో రోజున( 10th day of Muharram) అషూరా(Ashura)ను పాటిస్తారు. అషురా అనే పదం అరబిక్ పదం( 10th" in Arabic) ఆషారా నుంచి ఇది వచ్చింది. అషారా అంటే పది అని అర్థం. ఈ ఏడాది ఈరోజే (జులై 28‌)న అషూరా జరుకుంటున్నారు. అసలు ఏంటి అషూరా(What is Ashura).. దీనిని ముస్లింలు ఎందుకు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం.


ఇస్లాం విశ్వాసాల ప్రకారం 1400 సంవత్సరాల క్రితం అషూరా రోజున కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వీర మరణం పొందారు. ఇమామ్ హుస్సేన్ మరణాన్ని స్మరిస్తూ మొహర్రం ను పాటిస్తారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజున ఊరేగింపు, తజియాను తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. తైమూరిద్ సంప్రదాయాన్ని అనుసరించే ముస్లింలు ఈరోజున నమాజ్‌తో పాటు తాజీలు-అఖారాలను పూడ్చిపెట్టడం ద్వారా సంతాపం వ్యక్తం చేస్తారు.


అషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉంటారు. అయితే కచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమమేమీ లేదు. కానీ అల్లాహ్ దయ కోసం ముస్లింలు రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటారు. అషూరా రోజున ముస్లింలు ఉపవాసం ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అల్లాహ్ ఆషూరా రోజున ప్రవక్త ఆదాము దువాను స్వీకరించాడు. ఈ రోజున ఈజిప్ట్ ఫారో దౌర్జన్యం నుంచి ప్రవక్త మూసా నేతృత్వంలోని ఇశ్రాయేలీయులను శత్రువుల నుంచి అల్లాహ్ రక్షించాడు. ప్రవక్త మూసా ఈ రోజున ఉపవాసం ఉన్నారు. ఇంతేకాదు అల్లాహ్... ప్రవక్త ఇబ్రహీం ను అగ్ని నుంచి రక్షించాడు. ఈ కారణాల చేత ముస్లింలు ఈరోజు ఉపవాసం ఉంటారు.


ఆషూరా రోజుల్లో ఉపవాసం ఆధ్యాత్మిక విమోచనను అందిస్తుందని ముస్లింలు భావిస్తారు. చేసిన పాపాలన్నీ ఈ ఉపవాసంతో పోతాయని నమ్ముతారు. ప్రవక్త ముహమ్మద్ ఉపవాసం ఉండి.. జనాలను ఉపవాసం ఉండాలని ప్రోత్సహించిన రోజు ఇదేనని విశ్వసిస్తారు.


మొహర్రంకు ఒకరోజు ముందు, ప్రజలు బలిపీఠంపై తాజియాను ఉంచి, మరుసటి రోజు ఊరేగింపు నిర్వహిస్తారు. మొహర్రాన్ని సున్ని, షియా ముస్లింలు( Sunni and Shia Muslims) భిన్నంగా పాటిస్తారు. షియా ముస్లింలకు అషురా అనేది ఇమామ్ హుస్సేన్, అతని కుటుంబ సభ్యుల బలిదానం రోజును నిర్వహించుకునే ఓ సంతాప దినం. యుద్ధాన్ని మళ్లీ గుర్తుచేసుకునే నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. షియా ముస్లింలు ఆషూరా రోజున విలాప పద్యాలను పఠిస్తారు. ఆ పద్యాలు కర్బలా యుద్ధం గురించి వివరిస్తుంటాయి. సున్ని ముస్లింలు ఉపవాస దినంగా పాటిస్తారు. ఆషూరా రోజున పాపాలను పోగొట్టడానికి దానధర్మాలు చేయమని ముస్లింలను ప్రోత్సహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story