ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి.. ఎవరీ విష్ణు దేవ్ సాయి

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి.. ఎవరీ విష్ణు దేవ్ సాయి
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌గఢ్ తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌గఢ్ తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించింది. ఈ ప్రముఖ రాజకీయ నాయకుడి నేపథ్యం గురించి తెలుసుకుందాం..

ఛత్తీస్‌గఢ్ మొదటి గిరిజన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి చారిత్రాత్మక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి షెడ్యూల్డ్ తెగ (ST)కు చెందిన వారు. రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన విష్ణు దేవ్ సాయి గ్రామ సర్పంచ్‌గా తన పొలిటికల్ కెరీర్ ని ప్రారంభించారు. అతని తాత బుద్నాథ్ సాయి 1947 నుండి 1952 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అన్నయ్య నరహరి ప్రసాద్ సాయి జనతా పార్టీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా వివిధ హోదాలలో పని చేశారు.

గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన విష్ణు దేవ్ సాయి రాజకీయ నిచ్చెనలను అధిరోహించి, ప్రధాని మోదీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. బిజెపికి చెందిన దిలీప్ సింగ్ జుదేవ్ ప్రోత్సాహంతో, సాయి 1990లో తప్కారా నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో పాతాల్‌గావ్ నుంచి ఓటమి పాలైనప్పటికీ, ఇటీవలి 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుని కుంకూరి నియోజకవర్గాన్ని దక్కించుకున్నారు.

విష్ణు దేవ్ సాయికి బలమైన పార్లమెంటరీ చరిత్ర ఉంది. 1999 - 2014 మధ్య రాయ్‌ఘర్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. జష్‌పూర్‌లో జన్మించిన, కన్వర్ తెగకు చెందిన విష్ణు దేవ్ సాయి, కుంకూరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు. అతను అంబికాపూర్‌లో కళాశాల విద్యను అభ్యసించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నా టిక్కెట్ రాలేదు. అయినా నిరాశ చెందక, 2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు, విష్ణుదేవ్ వ్యవసాయదారునిగా పనిచేశారు. అట్టడుగు వర్గాలతో అనుబంధం, గ్రామీణ సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లను కళ్లారా చూశారు. విష్ణు దేవ్ సాయి ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం ఛత్తీస్‌గఢ్ రాజకీయ దృశ్యంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. అతని గొప్ప రాజకీయ వారసత్వం, విభిన్న అనుభవాలు రాష్ట్ర భవిష్యత్తు ప్రగతి పథంలో పయనించేందుకు దోహదపడుతుందని అతన్ని ఎన్నుకున్న ప్రజలు విశ్వసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story