సుమలత సీటుకు జేడీఎస్ ఎసరు.. అయోమయంలో బీజేపీ

సుమలత సీటుకు జేడీఎస్ ఎసరు.. అయోమయంలో బీజేపీ

లోక్ సభ (Lok Sabha) సార్వత్రిక ఎన్నికల ముందు కర్ణాటక బీజేపీలో వాతావరణం వేడెక్కింది. కర్ణాటకలో బీజేపీ (Karnataka BJP), జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో కూటమిలో మండ్య లోక్ సభ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ అయింది. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత. ఆమె ఫిబ్రవరి 8నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ కీలక నేత బీ. ఎల్. సంతోష్‌ ను సెపరేట్ గా కలిసి చర్చించడం కర్ణాటక బీజేపీ రాజకీయాన్ని షేక్ చేస్తోంది.

ఢిల్లీకి వెళ్లడంపై ఎంపీ సుమలత, భర్త అంబరీష్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. మండ్య లోక్ సభలో పోటీపై బీజేపీ పెద్దలతో మాట్లాడామని అంబరీష్ తెలిపారు. తమ వాదన విన్న జేపీ నడ్డాకు, బీఎల్ సంతోష్‌ కు సుమలత థ్యాంక్స్ చెప్పారు. సుమలత అభ్యర్థనపై హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుందన్నది కర్ణాటకలో చర్చ జరుగుతోంది.

గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న జేడీఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికలకు జేడీఎస్, బీజేపీ కలిసి వెళ్తున్నాయి. సీటు షేరింగ్ పై జేడీఎస్ పార్టీ చీఫ్ మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడతో, బీజేపీ పెద్దలు ఇప్పటికే చర్చించారు. మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామితోనూ బీజేపీ హైకమాండ్ డిస్కస్ చేసింది. ఈ మండ్య నుంచి జేడీఎస్ పోటీకి సిద్ధమైపోవడంతో సుమలత శిబిరంలో కలత మొదలైంది.

2019లో లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి స్వతంత్ర పార్టీ క్యాండిడేట్ గా పోటీ చేసి గెలిచారు సుమలత. తరువాత బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు జేడీఎస్ ఎంట్రీతో ఏం జరుగుతుందనేది అతికొద్ది టైంలోనే బయటకు రానుంది. అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగుతుందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story