Missing women : మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్

Missing women : మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్
11, 14వ స్థానాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్

దేశవ్యాప్తంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు కనపడకుండా పోతున్నఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అందులో కొన్ని కేసులను పోలీసులు ఛేదిస్తే ఎన్నో కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. రాజ్యసభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్‌ మిశ్రా ఈ వివరాలు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు అదృశ్యమవుతున్న కేసులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2021లో మహారాష్ట్రంలో 56,498 మంది మహిళలు మిస్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో 55,704 మంది, పశ్చిమ బెంగాల్‌లో 50,998 మంది మహిళలు మిస్సింగ్ కేసుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తరువాత రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలు కూడా మహిళల మిస్సింగ్ కేసుల్లో ముందున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో గ‌త మూడేళ్ల‌లో మొత్తం 15వేల‌మంది బాలిక‌లు, 57వేల‌మంది మ‌హిళ‌ల‌ను మిస్సింగ్ అయ్యారు.. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ గ‌ణాంకాల‌ను విడుద‌ల చేసింది.. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2021 వరకు 7028 మంది బాలికలు, 22,278 మహిళలు కనపడకుండా పోయినట్టు పేర్కొంది. అలాగే, తెలంగాణలో 8066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు మిస్ అయినట్లు వెల్ల‌డించింది. ఈ లెక్కన మహిళలు, చిన్నారుల మిస్సింగ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ 14వ స్థానంలోనూ, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి.

రాజ్యసభ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు గాను.. హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత కొంత కాలంగా ఏపీలో బాలికల, మహిళలు అదృశ్యంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం లెక్కలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది

Tags

Read MoreRead Less
Next Story