India vs Japan: జపాన్‌ చిత్తు...ఫైనల్లో భారత్‌

India vs Japan: జపాన్‌ చిత్తు...ఫైనల్లో భారత్‌
ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో కొనసాగుతున్న భారత జైత్రయాత్ర... టీమిండియా దూకుడు ముందు తేలిపోయిన జపాన్‌

ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో పరాజయం ఎరుగకుండా సెమీస్‌ చేరిన టీమ్‌ఇండియా.. అదే ఊపులో ఫైనల్‌ చేరింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 5-0తో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సేన దూకుడు ముందు జపాన్ తేలిపోయిది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. ఫైనల్లో మలేషియా(final clash with Malaysia)తో అమీతుమీ తేల్చుకోనుంది.


భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ(, Asian Champions Trophy 2023) ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సాధికారికంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో 5-0తో జపాన్‌(India vs Japan)ను చిత్తుచేసింది. గ్రూప్‌ దశలో జపాన్‌తో జరిగిన పోరును ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్‌.. ఈ సారి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. తొలి 15 నిమిషాల్లో మాత్రమే భారత్‌ చేసిన దాడులను జపాన్‌ అడ్డుకోగలిగింది(Japanese coffin). కానీ రెండో క్వార్టర్లో హర్మన్‌ప్రీత్‌ సేన ఆతిథ్య జట్టు రెచ్చిపోయింది. 12 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్‌ కొట్టేసింది. 19వ నిమిషంలో ఆకాశ్‌దీప్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలోకి నిలిపాడు. 23 నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేస్తూ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 30వ నిమిషంలో మన్‌దీప్‌ గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని మరింత పెంచాడు.


మూడో క్వార్టర్లో 39వ నిమిషంలో సుమిత్‌, నాలుగో క్వార్టర్‌లో 51వ నిమిషంలో కార్తి సెల్వం( Karthi Selvam ) గోల్స్‌ చేయడంతో భారత్‌ తిరుగులేని విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థిని పూర్తి డిఫెన్స్‌లోకి నెట్టేసిన టీమిండియా చివరి వరకు అదే జోరు కొనసాగించింది. టోర్నీలో మూడుసార్లు టైటిల్‌ గెలిచిన భారత్‌ఫైనల్‌ చేరడమిది అయిదోసారి. మరో సెమీఫైనల్లో మలేసియా ఆధిపత్యం చలాయిస్తూ 6-2తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాను మట్టికరిపించింది. అయిదో స్థానం కోసం జరిగిన ఇంకో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 6-1తో చైనాను మట్టికరిపించింది. భారత్‌, మలేసియా మధ్య ఫైనల్‌ ఆదివారం జరుగుతుంది.


భారత గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ ఈ మ్యాచ్‌తో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఆట ఆరంభానికి ముందు నిర్వాహకులు శ్రీజేశ్‌ను ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇదంతా అభిమానుల అండదండలతోనే సాధ్యమైందన్న రీతిలో శ్రీజేశ్‌ మోకాళ్లపై నిల్చొని ఇచ్చిన స్టిల్‌ అభిమానులను కట్టిపడేసింది.

Tags

Read MoreRead Less
Next Story