Ishan Kishan : ఇషాన్ కిషన్కు బీసీసీఐ షాక్ .. కాంట్రాక్టు రద్దు?

Ishan Kishan : ఇషాన్ కిషన్కు  బీసీసీఐ  షాక్ ..  కాంట్రాక్టు రద్దు?

టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో 2024,25కు గానూ బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టును ప్రకటించనుంది. ఈ క్రమంలో గ్రేడ్ సీలో ఉన్న ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించే ఛాన్స్ లేనట్లు టాక్. 2022-23లో తొలిసారి ఇషాన్ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. గ్రేడ్ సీ కింద ఇషాన్ కిషన్ ఏడాదికి రూ. కోటి వేతనం అందుకుంటున్నారు.

గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్‌.. సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి బీసీసీఐ, భారత జట్టు మేనెజ్‌మెంట్‌తో టచ్‌లో లేడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కిషన్‌ అందుబాటులో ఉంటాడని భావించారు.

కానీ తొలి రెండు టెస్టు ప్రకటించిన జట్టులో కిషన్‌ పేరు కన్పించలేదు. రెండో టెస్టు అనంతరం భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే కిషన్‌ కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. కానీ కిషన్‌ రాహుల్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోలేదు. భారత్ తరఫున ఇప్పటివరకు ఇషాన్ 2 టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.

Tags

Read MoreRead Less
Next Story