Cricket: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ అరెస్ట్

Cricket: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ అరెస్ట్
Cricket: క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌గా పనిచేసిన నరేంద్ర షా‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేశారని సర్కిల్ ఆఫీసర్ పంకజ్ గైరోలా తెలిపారు.

Cricket: క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌గా పనిచేసిన నరేంద్ర షా‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేశారని సర్కిల్ ఆఫీసర్ పంకజ్ గైరోలా తెలిపారు.తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. AIIMS-Rishikesh నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేశారు. సొంతగా క్రికెట్ శిక్షణ అకాడమీని నడుపుతున్న షా, తన వద్ద శిక్షణ పొందుతున్న మైనర్‌తో సహా ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతను విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతనిపై లైంగిక వేధింపులు మరియు SC/ST చట్టం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. మరోవైపు, షాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ ఉషా నేగీ ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలకు లేఖ రాశారు.

Tags

Read MoreRead Less
Next Story