CRICKET: ఆసియా కప్‌ షెడ్యూల్ విడుదల..

CRICKET: ఆసియా కప్‌ షెడ్యూల్ విడుదల..
ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ ధ్రువీకరించాడు.

క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ మనముందుకు రాబోతుంది. ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ ధ్రువీకరించాడు. గురువారం డర్బన్‌లో జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ జాకా అష్రాఫ్‌ కలిసి భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ధుమాల్‌ తెలిపాడు.

ఆసియా కప్‌లో మొత్తం 13 లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. నాలుగు పాకిస్థాన్‌లో, 9 శ్రీలంకలో జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.భారత్‌, పాక్‌ మ్యాచ్‌ సహా తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తుందని పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో తలపడతాయని, ఇరు జట్లు ఫైనల్ చేరితే మూడోసారి తలపడే అవకాశం ఉందన్నారు. ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరుకుంటే లంకలోనే తుదిపోరు జరుగుతుంది. ఆసియా కప్ సందర్భంగా ఏసీసీ ప్రెసిడెంట్ అయిన జై షా పాకిస్థాన్ వెళ్లబోవడం లేదని ఆయన తెలిపారు. ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్, నేపాల్ బరిలోకి దిగనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో పాకిస్థాన్, ఇండియా, నేపాల్ ఉండగా.. గ్రూప్-Bలో అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి.



Tags

Read MoreRead Less
Next Story