క్రీడలు

ఇక అభిమానుల మ‌ధ్య ఐపీఎల్‌..2వ ఫేజ్‌లో ఫ్యాన్స్‌కి అనుమ‌తి

కోవిడ్ భ‌యంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ లేక వెల‌వెల‌పోయిన స్టాండ్స్ ఇక సంద‌డిగా మార‌బోతున్నాయి.

ఇక అభిమానుల మ‌ధ్య ఐపీఎల్‌..2వ ఫేజ్‌లో ఫ్యాన్స్‌కి అనుమ‌తి
X

కోవిడ్ భ‌యంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ లేక వెల‌వెల‌పోయిన స్టాండ్స్ ఇక సంద‌డిగా మార‌బోతున్నాయి. వీవో ఐపీఎల్ 2021 కొత్త వేదిక‌లు క్రికెట్ అభిమానుల‌కు స్వాగ‌తం పలికేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మొద‌ల‌వ‌నున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో చెన్నై-ముంబై మ‌ధ్య జ‌రిగే తొలి మ్యాచ్‌‌కు దుబాయ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ కు ఫ్యాన్స్ హాజ‌ర‌య్యేందుకు యూఏఈ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. డిఫెండెబుల్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి ముంబై హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్ కోసం రేసులో నిల‌వ‌గా.. అపోనెంట్ చెన్నై టీం గ‌తేడాది వైఫ‌ల్యాల‌ను అధిగమించేలా బ్రేక్ త‌ర్వాత చెల‌రేగిపోయేందుకు రెడీ అవుతున్నాయి.

ఐపీఎల్ మ‌హా వినోదాన్ని ఆస్వాదించాల‌నుకుంటున్న అభిమానులు.. ఇక కోవిడ్ అడ్డంకుల‌తో బేజార‌వ్వాల్సిన అవ‌స‌రం లేదు. సెప్టెంబ‌ర్ 16 నుంచి ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్ http://www.iplt20.comలో టికెట్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు లేదా http://PlatinumList.netలో కూడా టిక్కెట్లను కొనుక్కోవ‌చ్చు. అయితే.. కోవిడ్ ప్రోటోకాల్‌, యూఏఈ ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్య‌లోనే అభిమానుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

Next Story

RELATED STORIES