Ind vs Ban Cricket: తొలి T20 లో భారత్ బోణి

Ind vs Ban Cricket: తొలి T20 లో భారత్ బోణి
బంగ్లాదేష్ 114/5 (షోర్ణ 28*, మోస్తరి 23, వస్త్రాకర్ 1-16)-->-20 ఓవర్లు భారత్ 118/3 (హర్మన్‌ప్రీత్ 54*, మంధనా 38, సుల్తానా 2-25)--->16.2 ఓవర్లు

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. మిర్పూర్‌లో షేర్‌-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో గెలుపు తీరాలకు చేర్చింది. 2వ టీ20 జూన్ 11న అదే స్టేడియంలో జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.


115 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన భారత్‌ జట్టు మొదటి ఓవర్లోనే షెఫలీ వర్మ వికెట్‌ను కోల్పోయింది. త్రీ ఓవర్ల తర్వాత జెమీయా రోడ్రిగ్ కూడా బౌల్డై వెనుదిరిగింది. అయితే బంగ్లా సంబరాలు కొద్దిసేపే. తర్వాత వచ్చిన స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్‌లు వరుస బౌండరీలు కొట్టడంతో పవరప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. బంతి గతి తప్పినపుడల్లా బౌండరీలు కొడుతూ 3వ వికెట్‌కి 55 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 38 పరుగులు చేసిన మందనా 3వ వికెట్‌ రూపంలో వెనుదిరిగింది. 24 పరుగుల వద్ద వచ్చిన క్యాచ్ మిస్ అవకాశాన్ని హర్మన్‌ప్రీత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. 17వ ఓవర్లో సిక్స్‌తో 34 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసింది. తరువాతి బాల్‌కి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయం సాధించిపెట్టింది.

అంతకు ముందు టాస్‌ ఓడి, మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాటింగ్‌కి దిగింది. ఓపెనర్ షమీమా సుల్తానాను ఔట్ చేసి, భారత బౌలర్ మిన్ను మణి భారత్‌కు మొదటి వికెట్ తీసిపెట్టింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వరుస ఫోర్లతో ధాటిగా ఆడటంతో బంగ్లా స్కోర్ 7 ఓవర్లలో 46 పరుగులకు చేరింది. 9వ ఓవర్‌లో షతి రాని ఔటవ్వడంతో స్కోర్ వేగం మందగించింది. 11వ ఓవర్లో లేని పరుగు కోసం యత్నించి నిగర సుల్తానా వికెట్‌ని కూడా కోల్పోయింది. చివర్లో షోర్ణ అక్తర్ మెరుపులు మెరిపించడంతో బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, మిన్ను మని, షెఫాలీ వర్మలు ఒక్కో వికెట్ తీశారు.


బంగ్లాదేష్ 114/5 (షోర్ణ 28*, మోస్తరి 23, వస్త్రాకర్ 1-16)-->-20 ఓవర్లు

భారత్ 118/3 (హర్మన్‌ప్రీత్ 54*, మంధనా 38, సుల్తానా 2-25)--->16.2 ఓవర్లు


Tags

Read MoreRead Less
Next Story