ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్ట్ టాస్ ఓడిన భారత్

ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్ట్ టాస్ ఓడిన భారత్

భారత్ ,ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ (india vs england) గురువారం (నేడు) ప్రారంభమైంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు హైదరాబాద్ (Hyderabad) ఆతిథ్యం ఇస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతని స్థానంలో పుజారా, రజత్ పాటిదార్‌తో పాటు మరికొందరు యువ క్రికెటర్ల పేర్లు జట్టులోకి వచ్చాయి. కానీ వారిలో ఎవరికీ అవకాశం రాలేదు. శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) తుది జట్టులోకి తీసుకున్నారు.

యశస్వి జైస్వాల్‌తో (Yasaswi Jaiswal) పాటు రోహిత్ శర్మ (Rohit Sharma) ఓపెనర్‌గా గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కేఎల్ రాహుత్‌తో (KL Rahul) పాటు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyar) మిడ్-లెవల్ బాధ్యతలను చేపట్టనున్నారు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కేఎస్ భరత్ (KS Bharat) విఫలమవుతున్నాడు. ఈ సిరీస్ అతనికి కీలకంగా మారింది. టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవాలంటే తొలి టెస్టులో బ్యాట్‌తో రాణించాల్సి ఉంది. సీనియర్లు అశ్విన్ (Ashwin), జడేజా (Jadeja) స్పిన్నింగ్ టీమ్‌ను మోయనున్నారు. వీరితో పాటు మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతని బ్యాటింగ్ సత్తా జట్టుకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. బుమ్రా (Bumrah), సిరాజ్ (Siraj) పేస్‌ను చూసుకుంటారు.

బ్యాటింగ్ లైనప్...

టీమ్ ఇండియాను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ కూడా ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించనుంది. టామ్ హార్టీ తొలి టెస్టుతోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతనితో పాటు పాక్ మూలానికి చెందిన స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కూడా తొలి టెస్టులో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్, బేర్ స్టో, రూట్ వంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

50 సార్లు ఇంగ్లండ్...

ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ జట్లు 131 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ యాభై సార్లు గెలుపొందగా...భారత్ 31 టెస్టుల్లో విజయం సాధించింది. యాభై మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. స్వదేశంలో ఇంగ్లండ్‌పై భారత్ 22 సార్లు విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమ్ ఇండియా ఇప్పటి వరకు ఐదు టెస్టులు ఆడింది. అందులో నాలుగు గెలుపొందగా, ఒకటి డ్రాగా ముగిసింది.

ఇదీ టీమ్ ఇండియా టీమ్

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, జడేజా, బుమ్రా, సిరాజ్, యశస్వి జైస్వాల్, అశ్విన్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్,

ఇది ఇంగ్లండ్ జట్టు.

బెన్ స్టోక్స్, బేర్ స్టో, రూట్, డకెట్, క్రాలే, ఒల్లీ పోప్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, హార్టీ, మార్క్ వుడ్, లీచ్

Tags

Read MoreRead Less
Next Story