Messi gifts: జట్టుకు మెస్సీ గోల్డ్ గిప్ట్.. 35 బంగారు ఐఫోన్లు బహుమతిగా..

Messi gifts: జట్టుకు మెస్సీ గోల్డ్ గిప్ట్.. 35 బంగారు ఐఫోన్లు బహుమతిగా..
Messi gifts: ప్రపంచకప్ విజేత అర్జెంటీనా జట్టుకు మెస్సీ 35 బంగారు ఐఫోన్లను బహుమతిగా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Messi gifts: ప్రపంచకప్ విజేత అర్జెంటీనా జట్టుకు మెస్సీ 35 బంగారు ఐఫోన్లను బహుమతిగా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత డిసెంబర్‌లో ఖతార్‌లో 2022 FIFA వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా జట్టు కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వినువీధుల్లో ఎగురవేసినందుకు గుర్తుగా, కెప్టెన్ లియోనెల్ మెస్సీ మొత్తం జట్టుకి, సహాయక సిబ్బందికి 35 బంగారు పూతతో కూడిన ఐఫోన్ 14లను బహుమతిగా ఇచ్చాడు. 24-క్యారెట్ గోల్డ్ ప్లేట్ ఆపిల్ పరికరాల మీద ప్రతి ఆటగాడి పేరు, జెర్సీ నంబర్ మరియు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) లోగోతో చెక్కబడి ఉన్నాయి.

మారడోనా '86 తరువాత 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రపంచ కప్ అందుకుంది. రూ. 1.73 కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల బంగారు ఐఫోన్‌లు మెస్సీ నివసిస్తున్న పారిస్‌లోని అపార్ట్‌మెంట్‌కు శనివారం డెలివరీ చేయబడ్డాయి- ప్రతి పరికరం మీద జట్టు సభ్యుని పేరు, నంబర్ మరియు అర్జెంటీనా లోగో చెక్కబడి ఉంటుంది. రెండుసార్లు గోల్డెన్ బాల్ విజేత ఖతార్‌లో జరిగిన 2022 ప్రపంచ కప్‌లో తన జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని "ప్రత్యేకమైన వస్తువు"తో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాడు.

"అద్భుతమైన విజయాన్ని జరుపుకోవడానికి ఆటగాళ్ళు మరియు సిబ్బంది అందరికీ ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. వాచ్ వంటి బహుమతులు అయితే అందరూ ఇస్తారు. అందుకే స్పెషల్‌గా ఉండాలని వారి పేర్లతో చెక్కబడిన బంగారు ఐఫోన్‌లను ఇవ్వాలనుకున్నారు. మెస్సీ బహుమతి చాలా మంది ఫుట్‌బాల్ అభిమానులను ఆకర్షించింది.

Tags

Read MoreRead Less
Next Story