Mithali Raj: చరిత్ర సృష్టించనున్న మిథాలీ రాజ్.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు

Mithali Raj: చరిత్ర సృష్టించనున్న మిథాలీ రాజ్.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు
Mithali Raj: ఈ అవార్డుకు మిథాలీ పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది.

Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. వన్డే, టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మిథాలీ ఈ ఏడాది జూన్‌లో బీసీసీఐ సిఫార్సు చేసిన మహిళా క్రికెటర్లలో ఒకరు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించనుంది.

ఈ అవార్డుకు మిథాలీ పేరును బీసీసీఐ సిఫార్సు చేసింది. ఖేల్ రత్న అవార్డుకు మిథాలీ, స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్లను సిఫారసు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదిలా ఉండగా, అర్జున అవార్డు కోసం కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ పేర్లు ముందుకు వచ్చాయి. మిథాలీ మహిళా క్రికెట్‌లో విజయపతాకం ఎగురవేసింది.

మార్చిలో, ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్ (మహిళలు)గా నిలిచింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఆమె 220 ఓవర్లలో 51.32 సగటుతో 7,391 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో 6,000, 7,000 పరుగులు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.

2020లో, రోహిత్ శర్మ (క్రికెట్), మరియప్పన్ తంగవేలు (పారాలింపిక్ హైజంప్), మనిక బాత్రా (టేబుల్ టెన్నిస్), వినేష్ ఫోగట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ) భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవమైన ఖేల్ రత్న గ్రహీతలు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత ఈ అవార్డు అందుకున్న నాలుగో క్రికెటర్ రోహిత్. కాగా, ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story