IPL : ఐపీఎల్ కోసమే ఆడొద్దు.. బీసీసీఐ వార్నింగ్.. పంత్ ఈజ్ బ్యాక్

IPL : ఐపీఎల్ కోసమే ఆడొద్దు.. బీసీసీఐ వార్నింగ్.. పంత్ ఈజ్ బ్యాక్

ఐపీఎల్ కోసం మాత్రమే ఎదురు చూసే ప్లేయర్లకు బీసీసీఐ గట్టిగా మందలించింది. టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చింది. దేశవాలీ టోర్నీలకు దూరంగా ఉంటూ టైంపాస్ చేస్తున్న ఆటగాళ్లు సెట్ రైట్ అయ్యేలా షాక్ ఇచ్చింది.

భారత జాతీయ క్రికెట్ జట్టుతో లేనివారు, జాతీయ క్రికెట్ అకాడమీలో లేని ఆటగాళ్లందరూ వెంటనే తమ రంజీ జట్లతో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తమ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపింది. ఆటగాళ్లకు బోర్డు మెయిల్స్ పంపింది. క్రికెట్ కు దూరంగా ఉంటున్న వారిలో.. ఇషాన్ కిషన్, దీపక్ చాహార్, కృనాల్ పాండ్యా వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.

ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. యాక్సిడెంట్ గాయాల నుంచి టీం ఇండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నారు. రికవరీ గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. తాజాగా నెట్స్ లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఈ ఏడాది ఐపీఎల్ కు, ఆ తర్వాత టీం ఇండియాలో ఆడే చాన్సెస్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story