IPL 2024 : ఐపీఎల్-లో ఆర్సీబీ ఓ చెత్త రికార్డు

IPL 2024 : ఐపీఎల్-లో ఆర్సీబీ ఓ చెత్త రికార్డు

ఈ సీజన్‌లో ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. తాజాగా కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 223 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 221 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో కర్ణ్ శర్మ 3సిక్సర్లు కొట్టినా అతడు ఔట్ కావడంతో ఆర్సీబీ ఓటమి చెందింది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.

ఐపీఎల్- హిస్టరీలో కేకేఆర్ తొలిసారి ఒక రన్ తేడాతో ఆర్సీబీ పై గెలిచింది. గతంలో ఆర్సీబీ (2014), పంజాబ్ (2020)పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఆర్సీబీ , ముంబై చెరో 3 సార్లు, పంజాబ్ రెండు సార్లు, చెన్నై, లక్నో, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కోసారి ఒక రన్ తేడాతో గెలిచాయి.

ఐపీఎల్-2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్సీబీ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్‌లో పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. కేకేఆర్(85/0, 75/1), ముంబై (72/0), సన్ రైజర్స్ (76/0)తో జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

Tags

Read MoreRead Less
Next Story