టీమ్ ఇండియాకు షారూఖ్ భావోద్వేగ సందేశం

టీమ్ ఇండియాకు షారూఖ్ భావోద్వేగ సందేశం
ప్రపంచ కప్ ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు షారూఖ్ ఖాన్ భావోద్వేగ సందేశం ఇచ్చారు.

ప్రపంచ కప్ ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు షారూఖ్ ఖాన్ భావోద్వేగ సందేశం ఇచ్చారు. నరేంద్ర మోదీ స్టేడియంలో షారుఖ్ ఖాన్ టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. 2023 పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు ఆడిన తీరుకు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమిని చవిచూసింది.

ఈ మొత్తం టోర్నీని మెన్ ఇన్ బ్లూ ఆడిన తీరు గౌరవప్రదమైనదని, వారు గొప్ప స్ఫూర్తిని, పట్టుదలను ప్రదర్శించారని షారుక్ అన్నారు. అతను X కి వెళ్లి ఇలా వ్రాశాడు, "భారత జట్టు ఈ మొత్తం టోర్నమెంట్‌ను ఆడిన విధానం గౌరవప్రదమైనది. వారు గొప్ప స్ఫూర్తిని, పట్టుదలను కనబరిచారు. ఇది ఒక క్రీడ మాత్రమే. ఎల్లప్పుడూ చెడ్డ రోజులు ఉండవు. ఈ బాధ కొన్ని రోజులు ఉంటుంది. తరువాత మళ్లీ మాములు అయిపోవాలి. లేకపోతే ముందుకు సాగలేం.

దురదృష్టవశాత్తూ అన్ని మ్యాచులు విన్ అయిన భారత్ ఫైనల్లో ఓడిపోయి కప్పు చేజారింది. క్రికెట్‌లో మా క్రీడా వారసత్వం గురించి మమ్మల్ని గర్వించేలా చేసినందుకు టీమ్ ఇండియాకు ధన్యవాదాలు... మీరు భారతదేశం మొత్తానికి చాలా ఉత్సాహాన్ని అందించారు. ప్రేమని, గౌరవాన్ని పొందారు. దేశం గర్వించేలా మీ టీమ్ ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నరేంద్ర మోదీ స్టేడియంలో కింగ్ ఖాన్ టీమ్ ఇండియాకు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. తెల్లటి టీ షర్టు, నీలిరంగు డెనిమ్ ప్యాంట్ ధరించిన షారుఖ్ అభిమానులను ఆకట్టుకున్నాడు. దానికి తోడు నలుపు సన్ గ్లాసెస్‌తో లుక్‌ను మార్చేశాడు. భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ కూడా మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చారు.

పఠాన్, జవాన్ అనే రెండు భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించిన SRK ఈ సంవత్సరం తన మూడవ చిత్రం డుంకీ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్రమ వలసల భావనను సామాజిక కామెడీగా చూపిస్తుంది. ఇందులో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కూడా నటించారు.

పఠాన్, జవాన్ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు, సూపర్ స్టార్ మరో రికార్డును క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దీంతో ఒకే సంవత్సరంలో తన కెరీర్‌లో మూడవ బిగ్గెస్ట్ హిట్‌ అందుకున్నట్లు అవుతుంది. డిసెంబర్ 22న డుంకీ థియేటర్లలో సందడి చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story