క్రీడలు

Virat Kohli: ఆదివారం ఆట ఎలా ఉంటుందో.. అనుష్క, వామిక ఉంటే చాలు..

Virat Kohli: నవంబర్ 7న న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న సమయంలో ఏమి జరుగుతుందో చూడాలి అని కోహ్లీ పేర్కొన్నాడు.

Virat Kohli: ఆదివారం ఆట ఎలా ఉంటుందో.. అనుష్క, వామిక ఉంటే చాలు..
X

Virat Kohli: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (నవంబర్ 5) జరుగుతున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత సారథి విరాట్ కోహ్లి జట్టు ఘనవిజయం సాధించింది. నవంబర్ 7న న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనున్న సమయంలో ఏమి జరుగుతుందో చూడాలి అని కోహ్లీ పేర్కొన్నాడు.

స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌ను 85 పరుగులకే ప్రత్యర్ధి సేనను కట్టడి చేసింది కోహ్లీ సేన. రవీంద్ర జడేజా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం టోర్నమెంట్‌లో ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీని నమోదు చేసుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, KL రాహుల్ భారత్‌కు విజయాన్ని అందించారు.

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, రోహిత్ 16 బంతుల్లో 30 పరుగులు చేసి నిష్క్రమించడంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 19 బంతుల్లో 50 పరుగులు చేసి KL రాహుల్ అతని వికెట్ కోల్పోయాడు. అయితే ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కారణంగా భారత్ 6.3 ఓవర్లలో ఆటను ముగించడంలో సహాయపడింది. భారతదేశం యొక్క నెట్ రన్ రేట్‌ సెమీ-ఫైనల్‌కు చేరుకునే ఆశలు కల్పించింది.

సూపర్ 12 దశలో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్‌లతో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత భారత్ టోర్నమెంట్‌లో పేలవమైన ఆటను ప్రదర్శించింది క్రికెట్ అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై 66 పరుగుల తేడాతో విజయం సాధించడంతో భారత జట్టు కాస్త ఊపందుకుంది.

ప్రస్తుతం సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం కోసం, మెరుగైన నెట్ రన్ రేట్‌తో భారత్ తమ మిగిలిన గేమ్‌ను గెలవాలి. అయితే, 37వ మ్యాచ్‌లో భారీ విజయం భారత్‌కు ఊపిరినందించింది. తమ జట్టు ప్రదర్శించిన ఆట తీరును ప్రశంసిస్తూ కెప్టెన్ విరాట్ ఇలా అన్నాడు. ఇప్పుడు 7వ తేదీన ఏమి జరుగుతుందో చూడాలి.

"ఈరోజు ప్రదర్శన గురించి పెద్దగా ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు.. మేము ఏం చేయగలమో మాకు తెలుసు. ఈ వేదికపై టాస్ ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతోంది. స్కాట్లాండ్‌ను 110 లేదా 120 లోపు కట్టడి చేయాలనుకున్నాం. రోహిత్, రాహుల్ నిలకడగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నాం. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ఇలాగే ఆడాం. కానీ అది పాక్, కివీస్ మ్యాచ్‌ల్లో వర్కవుట్ కాలేదు. ఆ రెండు జట్లు బౌలింగ్ అద్భుతంగా చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ రోజు జడేజా, షమి బాగా బౌలింగ్ చేశారు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కాగా, శుక్రవారం తన 33వ పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడుతూ సెలబ్రెట్ చేసుకునే దశ దాటిపోయిందని.. భార్య అనుష్క, కూతురు వామికను ఉద్దేశిస్తూ.. ప్రియమైవ వారు పక్కన ఉంటే వేడుకలో పనేముంది అని అన్నారు. అదే తనకు సెలబ్రేషన్ అని తెలిపాడు. టీమ్ ఇండియా ఆట తీరును ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్పారని కోహ్లీ వివరించాడు.

Next Story

RELATED STORIES