Ind vs Eng : పోరాడినా ఫలితం దక్కలేదు.. గెలవాల్సిన మ్యాచ్ చేజారింది

Ind vs Eng : పోరాడినా ఫలితం దక్కలేదు.. గెలవాల్సిన మ్యాచ్ చేజారింది

హైదరాబాద్ (Hyderabad) టెస్టులో తొలి రెండు రోజుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒల్లీ పోప్‌తో (Ollie Pope) ఆధిపత్యం ప్రదర్శించగా, నాలుగో రోజు ఇంగ్లండ్ ప్రముఖ బౌలర్ టామ్ హార్ట్లీ (Tom Hartley) 7 వికెట్లు పడగొట్టి భారత జట్టు పతనాన్ని శాసించాడు. ఫలితంగా 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 202 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులకు పైగా ఆధిక్యత కనబరిచిన టీమిండియా టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 231 పరుగుల విజయలక్ష్యంతో 4వ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 63 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 35 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి హార్ట్లీ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ ఓలీ పోప్ చేతికి చిక్కాడు.

దీంతో టీమిండియా 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో వికెట్‌కు 21 పరుగులు జోడించారు. 58 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను కూడా టామ్ హార్ట్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టించాడు. రోహిత్ శర్మ డీఆర్ఎస్ తీసుకున్నా.. బంతి వికెట్లను తాకినట్లు స్పష్టంగా తెలియడంతో ఫలితం లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను టీమ్ ఇండియా ప్రమోట్ చేసింది. 42 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన అక్షర్ పటేల్ టామ్ హార్ట్లీ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

48 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ జో రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 20 బంతులు ఆడిన రవీంద్ర జడేజా 2 పరుగులు చేసి బెన్ స్టోక్స్ డైరెక్ట్ డెలివరీలో ఔటయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story