Team India : U 19 వరల్డ్ కప్ లో టాప్ 6 లోకి టీమ్ ఇండియా

Team India : U 19 వరల్డ్ కప్ లో టాప్ 6 లోకి టీమ్ ఇండియా

2024 U19 ODI ప్రపంచ కప్ (U19 ODI World Cup) టోర్నమెంట్‌లో, భారత యువ జట్టు టేబుల్ టాపర్‌గా నాకౌట్ దశకు అర్హత సాధించింది. అమెరికాతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

ఆదర్శ్ సింగ్ (Adarsh Singh) 37 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేయగా, అర్షిన్ కులకర్ణి (Arshin Kulkarni) 118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) తమ్ముడు ముషీర్ ఖాన్ (Musheer Khan) 76 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు.

327 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికాకు శుభారంభం లభించలేదు. ప్రణవ్ చెట్టిపాళయం 2, భవ్య మెహతా ఔటవడంతో అమెరికా 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. వరుసగా వికెట్లు పడిపోవడంతో అమెరికా 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత అమెరికా తేరుకోలేకపోయింది. ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం కుదిరినా.. అప్పటికే ఓవర్లు అయిపోవడంతో అమెరికాకు పరాజయం తప్పలేదు. మొత్తం 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అమెరికా 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నమన్ తివార్ (Naman Tiwar) 4 వికెట్లు తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story