Rohit Sharma : దినేశ్ కార్తీక్ తర్వాత రోహిత్ శర్మే.. చెప్పుకోలేని రికార్డ్

Rohit Sharma : దినేశ్ కార్తీక్ తర్వాత రోహిత్ శర్మే.. చెప్పుకోలేని రికార్డ్

ఫోర్లు.. సిక్సర్లు వీరుడు రోహిత్ శర్మ (Rohit Sharma) క్రీజులో నిలబడితే సెంచరీలే. ఐపీఎల్ సీజన్లోనూ అతడు మెరుపులు మెరిపిస్తున్నాడు. ముంబై జట్టు గెలవక పోయినప్పటికీ.. తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కానీ రాజస్థాన్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో కీపర్ సంజూ సాంసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఈ అవుట్ ద్వారా అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.

17వ సీజన్లలో ఇప్పటివరకు ఏ ఆటగాడు నమోదు చేయని విధంగా.. అత్యధిక సార్లు డక్ ఔట్ అయిన చరిత్రను రోహిత్ శర్మ సమం చేశాడు. అంతకుముందు ఇది దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో 17 సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా డక్ అవుట్ అయిన రోహిత్ శర్మ.. దినేష్ కార్తీక్ సరసన నిలిచాడు.

రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ తర్వాత గ్లేన్ మాక్స్ వెల్(15), పీయూష్ చావ్లా (15), మన్ దీప్ సింగ్ (15), సునీల్ నరైన్(15), తర్వాత స్థానాల్లో డకౌట్ అయిన జాబితాలో కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story