CWC 2023: మహా సంగ్రామంలో మరో కీలక సమరం

CWC 2023: మహా సంగ్రామంలో మరో కీలక సమరం
ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ అమీతుమీ... గెలుపే లక్ష్యంగా బరిలోగి ఇరు జట్లు..

ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. వరుస విజయాలతో కంగారులు ఫామ్‌లో ఉండగా... ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క ఓటమితో న్యూజిలాండ్‌ కూడా మంచి ఊపులో ఉంది. ఈ మహా సంగ్రామంలో పేలవ ఆరంభం నుంచి పుంజుకున్న ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ చేరడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. భారత్‌, దక్షిణాఫ్రికాపై ఓటముల తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ అయిన కంగారులు వరుసగా మూడు విజయాలతో మళ్లీ గాడిన పడ్డారు. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 309 పరుగులతో ఓడించి ప్రత్యర్థులకు కంగారు జట్టు గట్టి హెచ్చరికలు పంపింది. టోర్నమెంట్‌లో కీలక దశలో ఐదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


మొత్తం 141 వన్డేల్లో ఈ రెండు జట్లు తలపడగా... 95 వన్డేల్లో కంగారులు... 39 వన్డేల్లో కివీస్‌ విజయం సాధించాయి. ప్రపంచ కప్‌లలో ఇప్పటివరకు ఆసిస్‌-ప్రొటీస్‌ 11 మ్యాచ్‌ల్లో తలపడగా ఆస్ట్రేలియా ఎనిమిది విజయాలు సాధించగా న్యూజిలాండ్‌ కేవలం మూడు మ్యాచుల్లోనే గెలిచింది. పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌పై మ్యాచుల్లో విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో దుర్భేద్యంగా కనిపిస్తోంది. డేవిడ్ వార్నర్ వరుసగా రెండు సెంచరీలు భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్టీవ్ స్మిత్, లబుషేన్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పకపోవ‌చ్చు. ప్రపంచకప్‌ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్ యొక్క వేగవంతమైన సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి రావడం కంగారులు కలిసి రానుంది. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కమిన్స్ బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. ఆడమ్

న్యూజిలాండ్‌ ఈ ప్రపంచకప్‌లోనూ పటిష్టంగా ఉంది. టీమిండియాపై తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. డెవాన్ కాన్వే నుంచి కివీస్‌ మరో భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. వికెట్ కీపర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మిచెల్ శాంట్నర్ ఈ మెగా టోర్నీలో సత్తా చాటుతున్నాడు.

ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

న్యూజిలాండ్ జట్టు:

ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్

Tags

Read MoreRead Less
Next Story