కోపం తగ్గాలంటే ఈ యాడ్‌లో.. : కోహ్లీ-గంభీర్‌లకు యువీ సలహా

కోపం తగ్గాలంటే ఈ యాడ్‌లో.. : కోహ్లీ-గంభీర్‌లకు యువీ సలహా
ఈ ప్రకటన ప్రచారానికి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సంతకం చేయాలి. అప్పుడు వాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ కూడా కూల్ అవుతారు అని యువరాజ్ సింగ్ ఓ ఫన్నీ సలహా ఇచ్చాడు

ఈ ప్రకటన ప్రచారానికి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ సంతకం చేయాలి. అప్పుడు వాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ కూడా కూల్ అవుతారు అని యువరాజ్ సింగ్ ఓ ఫన్నీ సలహా ఇచ్చాడు క్రికెట్ దిగ్గజాలకి. భారత క్రికెట్‌ చరిత్రలో ఇద్దరు పేరున్న పెద్ద క్రికెటర్లు.. విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్. ఇద్దరికీ ముక్కు మీద కోపం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అది అప్పుడప్పుడూ బరస్ట్ అవుతుంటుంది. మైదానంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు.. ప్రపంచం మొత్తం తమనే చూస్తుందనే విషయం అస్సలు జ్ఞప్తికే రాలేదేమో.. ఒకరి మీద ఒకరు ఫైర్ అయ్యారు.. మిగిలిన ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరి గొడవను సద్దుమణిగేలా చేయాల్సి వచ్చింది.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన IPL 2023 సోమవారం ఆట ముగిసిన తర్వాత ఎల్‌ఎస్‌జి మెంటార్ గంభీర్, ఆర్‌సిబి ప్రధాన ఆటగాడు కోహ్లీ మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

గత నాలుగు రోజులుగా వైరల్ అవుతున్న ఈ వార్తకు చెక్ పెట్టేందుకు క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫన్నీగా స్పందించాడు. కోహ్లీ, గంభీర్ ఓ శీతల పానీయం యాడ్‌కు పనిచేస్తే కోపం చల్లారి కూల్ అవుతారు అని ట్వీట్ చేశాడు.

గతంలో కోహ్లి, గంభీర్ ఢిల్లీ రాష్ట్ర జట్టు కోసం కలిసి ఆడారు. 10 ఏళ్ల క్రితం ఐపీఎల్‌లో బెంగళూరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన RCB మ్యాచ్‌లో కూడా వారు తలపడ్డారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కోహ్లీ, గంభీర్ ఇద్దరూ అంగీకరించారని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. వారికి భారీ జరిమానా విధించింది.

Tags

Read MoreRead Less
Next Story