Wrestling: నేను మోసపోయాను, ట్రయల్స్ జరగాల్సిందే: మహిళా రెజ్లర్ అంతిమ్

Wrestling: నేను మోసపోయాను, ట్రయల్స్ జరగాల్సిందే: మహిళా రెజ్లర్ అంతిమ్
భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా(Bajarang Punia), వినేష్ ఫోగట్‌(Vinesh Phogat)లు ఆసియా క్రీడలకు నేరుగా అర్హత సాధించడంపై పలువురు ఇతర రెజర్లు వ్యతిరేకిస్తుండటంతో పాటు ట్రయల్స్ అందరికీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా(Bajarang Punia), వినేష్ ఫోగట్‌(Vinesh Phogat)లను ఆసియా క్రీడలకు(Asia Games) నేరుగా పంపడంపై పలువురు ఇతర రెజర్లు వ్యతిరేకిస్తుండటంతో పాటు ట్రయల్స్(Fair Trails) అందరికీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘల్(Antim Pangal) వారిని నేరుగా ఎంపిక చేయడంపై ప్రశ్నలు వేసింది. గత సంవత్సరం తను సాధించిన ఘనతలు వెల్లడిస్తూ భావోగ్వేదంతో వీడియో విడుదల చేసింది.


"నాలాంటి అథ్లెట్లు చాలా మంది ఎంతగానో శ్రమిస్తున్నారు. అందరికీ సమాన అవకాశం కల్పించేలా ట్రయల్స్ ఉండాలి" అని కోరింది.

"గత సంవత్సరం వినేష్ ఫోగట్‌ గొప్పగా రాణించనప్పటికీ ఆమెని ఆసియా క్రీడలకి నేరుగా అనుమతించారు. దేని ఆధారంగా ఆమెని ట్రయల్స్‌ నుంచి మినహాయించారు. ఒలంపిక్(Olympics) మెడల్ సాధించిన సాక్షి మాలిక్‌(Sakshi Malik)కి కూడా మినహాయింపు ఇవ్వలేదు. వినేష్ ఫోగట్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటి. ట్రయల్స్ నిర్వహిస్తే ఇతర క్రీడాకారిణులు ఆమెతో తలపడి ఓడించగలరు. కామన్‌వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో కూడా 3-3 తేడాతో సమంగానే ఉన్నా, అప్పుడూ నన్ను మోసగించారు. పారదర్శకమైన ట్రయల్స్ జరగాల్సిందే " అని డిమాండ్ చేసింది.

2022లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెలిచిన మొదటి భారత రెజ్లర్‌గా ఘనత సాధించానంది. 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచానంది. వినేష్‌ ఫోగట్ ఏమాత్రం రాణించలేదు పైగా గాయంతో ఉందని వెల్లడించింది.

"ఆసియా గేమ్స్‌లో పాల్గొనే వారే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారంటున్నారు. అక్కడా గెలిస్తే ఒలంపిక్స్‌కి నేరుగా అర్హత పొందుతారు. మేం కూడా చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నాం, మరి మా పరిస్థితి ఏంటి" అని ప్రశ్నించింది.


వినేష్‌కి మద్దతు తెలిపినట్లే నాకు కూడా తెలపండి. నేను 4 సంవత్సరాలుగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు నేను రెజ్లింగ్ వదిలేయాలా అని ప్రశ్నించింది.

నిబంధనల ప్రకారం టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీం(TOPS)లో ఉన్న అథ్లెట్లకు ఎప్పుడైనా మినహాయింపు కోరితే దానికి అనుమతించేలా రూల్ ఉందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌లు ఇతర రెజ్లర్లతో కలిసి ఎంపీ, WFI చీఫ్ బ్రిజ్‌బూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ, అతని అరెస్ట్‌ కోసం ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story