శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

కరోనా వ్యాక్సిన్‌తో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు

కరోనా వ్యాక్సిన్‌తో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు
X

రష్యా అభివృద్ధి చేసిన మొదటి కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వితో మనుషులపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌. దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ.. డీసీజీఐకు దరఖాస్తు చేసింది. దేశంలో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యతలను చేపట్టేందుకుగానూ రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఆగస్టులోనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు మంజూరైతే.. తొలివిడతగా డిసెంబరుకల్లా పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులు రష్యా నుంచి రెడ్డీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి.

అటు.. ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌.. మూడు నెలల్లోనే బ్రిటన్‌లో అందుబాటులోకి రావచ్చంటూ ప్రఖ్యాత బ్రిటన్‌ వార్తాపత్రిక ది టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది. క్రిస్మస్‌ పండుగకు ముందే దానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పిల్లలు మినహా వయోజనులు అందరికీ ఆరు నెలల్లోగా ఒక డోసు వ్యాక్సిన్‌ను అందించాలనే కృత నిశ్చయంతో భారీ టీకా కార్యక్రమానికి బ్రిటన్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని కథనంలో పేర్కొంది.

Next Story

RELATED STORIES