శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

అపోలో నుంచి అతి తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌.. : శోభన కామినేని

అపోలో నుంచి అతి తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌.. : శోభన కామినేని
X

కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు దేశీయంగా వ్యాక్సిన్‌ల తయారీ ఊపందుకుంది. అపోలో ఆసుపత్రి సైతం మరో వంద రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ ను తీసుకురానున్నట్లు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని తెలిపారు. ప్రస్తుతం మూడో దశ కరోనా వ్యాక్సిన్ ట్రైయల్స్ జరుగుతున్నాయని...రోజుకు మిలియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కోవిడ్ 19పై ప్రభుత్వంచేస్తున్న యుద్దానికి మద్దతు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలోని అతి తక్కువ ధరకే అంటే కేవలం 250 రూపాయలకే వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శోభన కామినేని తెలిపారు.

Next Story

RELATED STORIES