శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ సంస్థ

కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన ఫైజర్ సంస్థ
X

కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లుకాసేలా ఎదురుచూస్తున్న ప్రజలకు అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 90శాతం పైగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. ప్రపంచ చరిత్రలోనే సైన్స్ సాధించిన అద్భుత విజయం ఇది అని హర్షం వ్యక్తంచేసింది. అయితే ఈ వ్యాక్సిన్ పరిశోధనా ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యేవరకు మరికొంత సమయం పడుతుందని తెలిపింది.

ఎవరికి వ్యాక్సిన్ ముందు అందుతుందనే అంశంపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ విజయవంతం వార్తతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. 1500 పాయింట్లకు పైగా లాభంతో ఢీ ఫ్యూచర్స్ దూసుకెళ్లింది. అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడిన వెంటనే కరోనా వ్యాక్సిన్ విజయవంతం వార్త బయటకు రావడం గమనార్హం.

Next Story

RELATED STORIES