Rolls Royce: రోల్స్ రాయిస్ నుంచి అద్భుతమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు

Rolls Royce: రోల్స్ రాయిస్ నుంచి  అద్భుతమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'స్పెక్టర్' ఇప్పుడు భారతదేశంలో ప్రారంభించారు. అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే స్పెక్టర్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.5 కోట్లుగా ఉంచారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ గత ఏడాది అక్టోబర్‌లో ఇంగ్లండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌లోని రోల్స్ రాయిస్ హోమ్‌లో ఆవిష్కరించారు. ఈ కారుకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

స్పెక్టర్‌లో 102kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. స్పెక్టర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 530కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. దాని బ్యాటరీ ప్యాక్‌లో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ అందించారు. దీని కారణంగా కారులోని నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది.

స్పెక్టర్ ఫ్రంట్ యాక్సిల్ 254bhp శక్తిని పొందుతుంది. అయితే దీని వెనుక యాక్సిల్ 482bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, స్పెక్టర్ మొత్తం 576bhp, 900Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పెక్టర్ 4.5 సెకన్లలో 0 నుండి 100కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

స్పెక్టర్ 22kW AC,50kW నుండి 195kW DC ఛార్జర్ మద్దతుతో తీసుకువచ్చారు. DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో దీనిని కేవలం 34 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఫీచర్స్ గురించి చెప్పాలంటే, రోల్స్ రాయిస్ స్పెక్టర్ రోల్స్ రాయిస్ 'వ్రైత్' లాగా కనిపిస్తుంది. స్పెక్టర్ ప్రకాశవంతమైన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఈ 4 సీటర్ ఎలక్ట్రిక్ కూపేలో 2 డోర్లు, 23 అంగుళాల వీల్స్ ఉన్నాయి. స్టార్‌లైట్ డోర్స్‌తో సహా స్పెక్టర్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఇది అల్ట్రా లగ్జరీ కారుగా చెప్పవచ్చు. ఇది 2,975 కిలోల కర్బ్ బరువుతో అత్యంత బరువైన రోల్స్ రాయిస్.

స్పెక్టర్ పట్ల ప్రపంచవ్యాప్త ఆకర్షణను పరిగణనలోకి తీసుకుంటే, 2024లో దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉండవచ్చు. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ న్యూ ఢిల్లీ డీలర్ ప్రిన్సిపాల్ యాదుర్ కపూర్ మాట్లాడుతూ, “ఉత్తర భారతదేశంలో రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాని అత్యాధునిక డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్, ఇంజనీరింగ్ ఆవిష్కరణలతో స్పెక్టర్ రోల్స్ రాయిస్ రాబోతుంది అని చెప్పారు.

Specter Rolls-Royce మోటార్ కార్ల కోసం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. దీని కోసం కొత్త ఆల్-ఎలక్ట్రిక్ యుగం మార్క్ ప్రారంభమైంది. 2030 చివరి నాటికి, దాని మొత్తం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారుతుంది.

Tags

Read MoreRead Less
Next Story