'పది' విద్యార్థులకు తెలుగు తప్పనిసరి: రాష్ట్ర విద్యాశాఖ

పది విద్యార్థులకు తెలుగు తప్పనిసరి: రాష్ట్ర విద్యాశాఖ
మాతృభాషపట్ల మమకారం పెంచుకోవాలి.. ఉద్యోగాల నిమిత్తం ఇంగ్లీషు చదువులు చదివినా మన భాషపై మనకు పట్టు ఉండాలి.

మాతృభాషపట్ల మమకారం పెంచుకోవాలి.. ఉద్యోగాల నిమిత్తం ఇంగ్లీషు చదువులు చదివినా మన భాషపై మనకు పట్టు ఉండాలి. ఆ దిశగానే చర్యలు తీసుకుంటోంది తెలంగాణ విద్యాశాఖ. విద్యార్దులు తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలని స్ఫష్టం చేసింది. వచ్చే ఏడాది పదోతరగతి విద్యార్ధులు తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పని సరి చేసింది.

ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో తెలుగు అమలు కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story