Top

తెలంగాణలో అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలి : వీహెచ్‌

అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీఎంపీ వీహెచ్ డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలి : వీహెచ్‌
X

అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీఎంపీ వీహెచ్ డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌పై విచారణ త్వరగా జరిగిపోయిందని... అలాగే మిగిలిన నేతలపైనా వేగంగ విచారణ జరిపించాలని అన్నారు. కీసరలో దళితుల భూముల ఆక్రమణల్ని సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి చెరువు కబ్జా చేశారని వీహెచ్‌ ఆరోపించారు. మంత్రి పువ్వాడ భూఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకుని.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES