Adilabad: ఉట్నూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

Adilabad: ఉట్నూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ITDA కార్యాలయంలోకి ఆదివాసీలు చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ముట్టడిలో భాగంగా ఆఫీస్‌పై రాళ్ల దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ITDA చైర్మన్ వాహనంపై కూడా రాళ్ల వర్షం కురిపించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తాము సాగుచేస్తున్న అటవీ భూములకు ఎలాంటి షరతులు, తీర్మానాలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ.. అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు.

జిల్లా, మండల కేంద్రాల్లో నివాసముంటున్న తమకు ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలని రచ్చ.. రచ్చ చేశారు. కొందరు ఆందోళనకారులు ఐటీడీఏ ఆఫీస్‌ ఫర్నీచర్‌, ఇతర వస్తువులను బిల్డింగ్‌పై నుండి కిందకు పడే శారు. మరికొందరు ఐటీడీఏ కార్యాలయం తలుపులు, అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులను, ఆఫీస్‌ గేట్లను తోసికొచ్చిన నిరసనకారులు నానా హంగామా చేశారు. గిరిజిన యూనివర్సిటినీ ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని ధర్నా నిర్వహించారు. ఇకపై దళితబంధు మాదిరిగా తమకు ఆదివాసీ బంధు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు

Tags

Read MoreRead Less
Next Story