Asaduddin Owaisi: సీఏఏపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: సీఏఏపై  సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ CAA పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం ముస్లింలను అణిచివేసేందుకు తీసుకొచ్చిన చట్టం అని మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వెంటనే ఈ చట్టం అమలుని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.నెక్ కి పౌరసత్వ సవరణ చట్టానికి దగ్గరి పోలిక కనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. కేవలం మైనార్టీ వర్గాలపై వివక్ష చూపించాలన్న కుట్రతోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఏఏని ఎన్పీఆర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్), ఎన్ఆర్ సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)తో కలిపి చూడాలని పేర్కొన్నారు.పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్ కు వలస వచ్చే హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇవ్వడానికి తానేమీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.కానీ, భవిష్యత్తులో మీరు ఎన్పీఆర్, ఎన్ఆర్ సీ తీసుకువస్తే 17 కోట్ల మంది ముస్లింల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. వారికి ఓ సొంత దేశం అంటూ లేకుండా చేయాలనుకుంటున్నారు అని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు ఎన్నికల్లో సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని ఓడిస్తారని ఒవైసీ పేర్కొన్నారు. ఓ ప్రాంతం ఆధారంగా చట్టాలు చేయలేరని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని అన్నారు.

ఇప్పటికే సుప్రీంకోర్టులో CAAకి వ్యతిరేకంగా పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా సర్వోన్నత న్యాయస్థానం మార్చి 19వ తేదీన విచారణ చేపట్టనుంది. మార్చి 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్‌లో హింసకు గురై భారత్‌కి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించనుంది. ముస్లిమేతరులకు మాత్రమే ఇది వర్తించనుంది. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు భారత్‌కి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తామని కేంద్రం వివరించింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్రంగా మండి పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story