Balapur Laddu: బాలాపూర్ లడ్డూకు భారీ ధర.. వేలం పాటలో..

Balapur Laddu: బాలాపూర్ లడ్డూకు భారీ ధర.. వేలం పాటలో..
బాలాపూర్‌లో గణేషుడి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. మండపం నుంచి బాలాపూర్‌ గణేషుడిని రథం పైకి నిర్వాహకులు తీసుకొచ్చారు. ప్రత్యేక రథంపై గ్రామంలో ఊరేగించనున్నారు.

Balapur Laddu: బాలాపూర్‌లో గణేషుడి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. మండపం నుంచి బాలాపూర్‌ గణేషుడిని రథం పైకి నిర్వాహకులు తీసుకొచ్చారు. ప్రత్యేక రథంపై గ్రామంలో ఊరేగించనున్నారు.

హైదరాబాద్‌ గణేష్ ఉత్సవాల్లో ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట పైనే. గత ఏడాది 18 లక్షల 90 వేల రూపాయల ధర పలికిన బాలాపూర్ లడ్డూ.... ఈఏడాది ఎంత ధర పలుకుతుoదోని భక్తుల్లో ఒక్కటే ఉత్కంఠ. బాలాపూర్ గణేష్ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకునేoదుకు భక్తులు పోటీ పడుతుoటారు. లక్షల రూపాయలు పెట్టి మరీ కొంటారు. ఈ లడ్డూను దక్కించుకుంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

1984 నుంచి బాలాపూర్‌లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నా.... 1994 నుంచి ఇక్కడ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రపంచంలో మొదటి సారిగా గణేష్ చేతిలో పెట్టిన లడ్డూ ప్రసాదం వేలం వేయడం బాలాపూర్ నుంచే ప్రారంభమైంది. 1994లో కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు మొదటి సారిగా 450 రూపాయలకు బాలాపూర్ గణేష్ చేతిలో పెట్టిన లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా లడ్డూను సొంతం చేసుకునేoదుకు పోటీ పెరిగింది.

దీంతో లడ్డూ ధర కూడా పెరుగుతూ వచ్చింది. గత ఏడాది 2021లో ఏపీకి చెందిన MLC రమేష్ యాదవ్.. ఆయన మిత్రుడు మర్రి శశాంక్ రెడ్డి 18 లక్షల 90 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వీళ్లు ముఖ్యమంత్రి జగన్‌కు బహుమతిగా అందించారు. 2020లో కరోనా కారణంగా వేలం పాటకు బ్రేక్ పడింది. ఆ ఏడాది తెలంగాణ సీఎం KCRకు బాలాపూర్ లడ్డూను నిర్వాహకులు అందించారు.

బాలాపూర్ లడ్డూ బరువు కేవలం 21 కేజీలే. ఇక్కడ ప్రసాదం పరిమాణం చిన్నదే అయినా.. ఆ లడ్డూను సొంతం చేసుకుంటే గణపతి కటాక్షం దక్కుతుందని సెంటిమెంట్‌గా భావిస్తారు భక్తులు. అందుకే ఈ లడ్డూ కోసం ఎన్ని లక్షలు పెట్టడానికైనా వెనుకాడరు. ఇక ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో దేవాలయాల అభివృద్ధి, గ్రామాభివృద్ధి సహా పలు స్వచ్ఛంద కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటారు. బాలాపూర్ గణేశుడు హైట్ లేకున్నా... లడ్డూ వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వినాయక చవితి ఉత్సవాలకే స్పెషల్‌గా నిలుస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story