Raghunandan Rao :జరిగిన ఘటనకు బాధ్యత వహించి సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలి : రఘునందన్ రావు

Raghunandan Rao :జరిగిన ఘటనకు బాధ్యత వహించి సీఎం, డీజీపీ క్షమాపణ చెప్పాలి : రఘునందన్ రావు
Raghunandan Rao : తొగుట మండలం గుడికందులలో పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆరోపించారు.

Raghunandan Rao : తొగుట మండలం గుడికందులలో పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన మార్కెట్‌ను ఓపెన్‌ చేసేందుకే తానూ వెళ్లానన్నారు. ఎంపీతో పాటు మంత్రి, ఇతర నాయకులను కూడా ఆహ్వానించామన్నారు రఘునందన్ రావు.

గొడవ జరిగే అవకాశముందని ముందే పోలీసులకు సమాచారమిచ్చామన్నారు. గ్రామస్థులు, మహిళలు TRS నేతలను అడ్డుకున్నారని చెప్పారు రఘునందన్ రావు. సభలో నలుగురు పోలీసులు మాత్రమే ఉన్నారని చెప్పారు. క్రిమినల్ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నవారు తనపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు.

శిలా ఫలకం కూల్చిన వారిపై కేసు పెట్టకుండా తనపైనే కేసు పెట్టారన్నారు. శిలాఫలకాలపై తమ పేర్లు అవసరం లేదన్న రఘునందన్ రావు..తానూ ప్రజల గుండెల్లో ఉన్నానన్నారు. జరిగిన దాడులకు సీఎం, డీజిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story