బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పట్నం

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పట్నం

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS) కు బిగ్ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ (Congress) లో చేరగా తాజాగా మరికొంతమంది నేతలు అదే బాట పట్టారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి (Mahendar Reddy), ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మహేందర్‌రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతారెడ్డి స్పష్టం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం నడిచింది. కానీ పట్నంకు కేసీఆర్ (KCR) మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆ ఎన్నికల్లో తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను మహేందర్‌రెడ్డి ఆశించారు. అయితే అధిష్ఠానం రోహిత్‌రెడ్డికి టికెట్‌ కేటాయించింది. కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సునీతారెడ్డి కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇదే విషయంపై పట్నం మహేందర్‌రెడ్డి సొదరుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పందించారు. మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth reddy) కలిసిన విషయం తాను మీడియాలో చూశానని, తనకు వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టాలు వారివన్న ఆయన తానూ మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story