తెలంగాణ

కరోనా సోకిన అత్త వింత ప్రవర్తన.. కోడలిని కౌగలించుకుని..

కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. ఆమెకు కరోనా సోకడంతో ఇంట్లో వాళ్లు హోం క్వారంటైన్ లో ఉంచారు.

కరోనా సోకిన అత్త వింత ప్రవర్తన.. కోడలిని కౌగలించుకుని..
X

ఇంట్లో ఒకరికి కరోనా వస్తే ఇంటిల్లపాదీ కరోనా బారిన పడకూడదనే ఉద్దేశంతో వారిని ఓ గదిలో ఉంచుతారు. ఇంట్లో వాళ్లకి దూరంగా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, డాక్టర్ సూచించిన మందులు వాడితే త్వరగా కోలుకుంటారు.

కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. ఆమెకు కరోనా సోకడంతో ఇంట్లో వాళ్లు హోం క్వారంటైన్ లో ఉంచారు. కానీ ఆమెకు ఇంట్లో వాళ్ల నుంచి దూరంగా ఉండడం ఇష్టం లేదు. ఆమె కొడుక్కి మూడేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతితో వివాహం అయింది.

వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కొడుకు బ్రతుకు దెరువు కోసం ఒడిశా వెళ్లి అక్కడే ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కరోనా సోకిన అత్త.. కోడల్ని ఆలింగనం చేసుకోవడం, పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం మొదలు పెట్టింది తాను చనిపోతే వాళ్లందరూ హాయిగా బతికేస్తారనే ఆలోచనతో.

అత్త అలా చేయడంతో మూడు రోజుల క్రితం కోడలికి కరోనా సోకింది. దీంతో ఆమెను అత్తమామ ఇంట్లో నుంచి గెంటేశారు. విషయం తెలుసుకున్న సోదరి ఆమెను ఆదరించి హోం క్వారంటైన్ లో ఉంచింది. తనకి కోవిడ్ రావడానికి అత్తే కారణమని, ఆమె చేసిన వింత ప్రవర్తనవల్లే తనకి కరోనా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story

RELATED STORIES