Warangal: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ సొసైటీ గోదాంలో మంటలు.. ప్రమాదంపై పలు అనుమానాలు..

Warangal: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ సొసైటీ గోదాంలో మంటలు.. ప్రమాదంపై పలు అనుమానాలు..
Warangal: వరంగల్‌లోని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ సొసైటీ గోదాములో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు

Warangal: వరంగల్‌లోని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ సొసైటీ గోదాములో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. గత రాత్రి అంటుకున్న మంటలు రగులుతూనే ఉన్నాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6 ఫైర్ ఇంజన్లు నిరంతరం శ్రమిస్తున్నా... మంటలు అదుపులోకి రాలేదు. మంటలు పూర్తిస్థాయిలో ఆర్పేందుకు మరికొంత సమయం పట్టవచ్చని అధికారులు అంటున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామ శివారులోని టెస్కో గోదాములో రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఇందులో 32 కోట్ల రూపాయల విలువ చేసే బెడ్‌షీట్లు, కార్పెట్లు, స్కూల్ యూనిఫామ్స్‌ ఉన్నాయి. అందులో మంటలు చెలరేగడంతో అవి పూర్తిగా దగ్దమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వివిధ కో-ఆపరేటివ్ సొసైటీల నుంచి టెస్కో కొనుగోలు చేసి గోదాంలో భద్రపరిచింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ గోదాంకు అసలు విద్యుత్ లేదు. కోట్ల విలువ చేసే ఈ గోదాముకు సెక్యూరిటీ కూడా లేదు. అయితే ఇందులో అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది అనుమానాస్పదంగా మారింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story