దుబ్బాక ఉపఎన్నిక : సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలంతా అక్కడే మకాం

దుబ్బాక ఉపఎన్నిక : సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలంతా అక్కడే మకాం

TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌ రావు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలు కొనసాగించాలనే... వారి సతీమణి సుజాతకు TRS టిక్కెట్‌ ఖరారు చేసిందని.. ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. చిట్టాపూర్‌ గ్రామంలో సుజాతను కలిసి, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. 2004 నుంచి సిద్ధిపేటలో ప్రతి ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సోలిపేట సుజాతను.. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలిపించుకుంటామని హరీష్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు తండ్రి లాంటి వారని.. తమ పెళ్లి, తమ పిల్లల పెళ్లి ఆయనే చేశారని సుజాత గుర్తు చేశారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్ ఆశించిన చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు..దుబ్బాక ఉపఎన్నికను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలంతా అక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రామాల వారిగా ఇంఛార్జ్ లను వేసిన పీసీసీ ..ఒక్కో ముఖ్యనేతకు ఒక్కో గ్రామం భాధ్యత అప్పగించింది. బుధవారం నుంచి 12తేదీ వరకు నేతలంతా దుబ్బాకలోనే ఉండనున్నారు. దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక అన్నారు కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి. 30 ఏళ్ళ పాటు ప్రజల కోసం పోరాడితే.. టిఆర్‌ఎస్‌ అవమానకరంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పేరును అధికారికంగా ఖరారు చేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018 ఎన్నికల బరిలో నిలిచిన రఘునందన్ రావు.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story