దుబ్బాకలో మోగిన ఎన్నికల నగారా.. ప్రచారంలో దూసుకెళ్తోన్న బీజేపీ

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గత నెల రోజుల నుంచి టీఆర్ఎస్, బీజెపి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్ రావు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. అసమ్మతి స్వరం వినిపించకుండా చేస్తున్నారు. దుబ్బాక మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు. అటు... ప్రచారంలో దూసుకెళ్తున్నారు రామలింగారెడ్డి సతీమణి సుజాత. అయితే టికెట్‌పై సీఎంకేసీఆరే నిర్ణయం తీసుకుంటారంటున్నారు మంత్రి హరీష్. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు మంత్రి త్రి హరీష్. ఇప్పటికే.. హరీష్ గ్రామాల వారీగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ నియోజకవర్గం అంతా కలియతిరిగారు.
మరోవైపు బీజెపి సైతం ప్రచారంలో దూసుకెళ్తోంది. గ్రామాల వారిగా ప్రచారం నిర్వహిస్తోంది. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు తనకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ప్రస్తుతం చతికిలబడినట్టే కనిపిస్తోంది. అప్పుడప్పుడు సమావేశం నిర్వహించడానికి పరిమితమైంది. అభ్యర్థి తేలకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. శ్రవణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట నరసింహ రెడ్డి తో పాటు మాజీ మంత్రి మదన్మోహన్ కోడలు సునీత పేరు తెరపైకి వచ్చాయి. అయితే గతంలో టికెట్ తీసుకొని ప్రచారం చేయకుండా ఉన్న సందర్భాల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది కాంగ్రెస్. మరోవైపు టీఆర్ఎస్ కోవర్టులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారా అంటూ దరఖాస్తులు ఇచ్చినవారిని అనుమానిస్తోంది టీ కాంగ్రెస్. మొత్తానికి.. ఈ పోటీలో.. టీఆర్ఎస్, బీజేపీలు ముందుండగా కాంగ్రెస్ వెనుకబడిట్లు కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com